బురదలో దొర్లితేనే పందులకు ఆనందం... నీవు వైసీపీతో కుమ్మక్కయ్యావు...

నెల్లూరు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌పై ఆధిపత్యంకోసం టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. మేయర్ అజీజ్‌పై ఆనం వివేకా నేరుగా విరుచుకుపడ్డారు. కార్పొరేషన్ కార్యాయలంపై ఏసీబీ దాడుల నేపథ్యంలో… కార్పొరేషన్‌ అవినీతి కంపుకొడుతోందని ఆనం వివేకా ఆరోపించారు. పందులకు బురదలో దొర్లితేనే ఆనందంగా ఉంటుందంటూ అజీజ్‌పై తీవ్రవ్యాఖ్యలు చేశారు. అజీజ్‌, ఆయన సోదరుడు జలీల్ కలిసి దోచేస్తున్నారని ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేశారు. నెల్లూర్‌కా సుల్తాన్ అనుకుంటున్నావా అని అజీజ్‌పై విరుచుకుపడ్డారు. అజీజ్‌ వల్ల టీడీపీకి, […]

Advertisement
Update:2016-06-21 05:20 IST

నెల్లూరు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌పై ఆధిపత్యంకోసం టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. మేయర్ అజీజ్‌పై ఆనం వివేకా నేరుగా విరుచుకుపడ్డారు. కార్పొరేషన్ కార్యాయలంపై ఏసీబీ దాడుల నేపథ్యంలో… కార్పొరేషన్‌ అవినీతి కంపుకొడుతోందని ఆనం వివేకా ఆరోపించారు. పందులకు బురదలో దొర్లితేనే ఆనందంగా ఉంటుందంటూ అజీజ్‌పై తీవ్రవ్యాఖ్యలు చేశారు. అజీజ్‌, ఆయన సోదరుడు జలీల్ కలిసి దోచేస్తున్నారని ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేశారు. నెల్లూర్‌కా సుల్తాన్ అనుకుంటున్నావా అని అజీజ్‌పై విరుచుకుపడ్డారు. అజీజ్‌ వల్ల టీడీపీకి, మంత్రి నారాయణకు చెడ్డపేరు వస్తోందంటూ వ్యవహారాన్ని అటుగా మళ్లించారు.

ఆనం వ్యాఖ్యలను తొలుత లైట్ తీసుకున్న మేయర్… టీడీపీ నేతలతో సంప్రదించిన తర్వాత ఎదురుదాడి చేశారు. ముస్లిం వ్యక్తి మేయర్ అవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నావ్ అంటూ మండిపడ్డారు. కార్పొరేషన్‌ ఏమైనా ఆనం జాగీరా అని ప్రశ్నించారు. నీవు టీడీపీని బాగుచేయడానికి వచ్చావా లేక నాశనం చేసేందుకు వచ్చావా అంటూ ప్రశ్నించారు. మేయర్ భానుశ్రీ హయాంలో కార్పొరేషన్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఆనం వైసీపీ వారితో కుమ్మక్కు అయి తన మీద ఆరోపణలు చేస్తున్నారని అజీజ్ ఆరోపించారు.

మరోవైపు మేయర్‌ తీరుపై మంత్రి నారాయణ కూడా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి అయి ఉండి కూడా సొంత కార్పొరేషన్‌లో పరిస్థితులను చక్కదిద్దలేకపోతున్నారని విమర్శలు మంత్రి మీద వస్తున్నాయి. దీనంతటికి కారణం అజీజేనని మంత్రి అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద నెల్లూరు కార్పొరేషన్‌పై పట్టుకోసం టీడీపీలోని రెండు వర్గాలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఏసీబీ రైడ్స్ కూడా జరిగాయని భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News