సీఎం చేస్తామన్నారు... ఫ్లోర్‌ లీడర్‌ను కూడా చేయలేదు... అందుకే

ఎన్నికలకు ముందు బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను  తెలంగాణ సీఎం అభ్యర్థిగా చంద్రబాబు తెరపైకి తెచ్చారు. కానీ టీటీడీపీ అధికారంలోకి రాలేదు. ఈ తర్వాత ఆర్‌. కృష్ణయ్యను టీడీపీ పూర్తిగా విస్మరించింది. ఈ విషయంపై ఆర్‌ కృష్ణయ్య తనలోని అసంతృప్తిని ఒక మీడియా సంస్థ వద్ద వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన వారు… ఆ తర్వాత కనీసం ఫ్లోర్‌లీడర్‌గా కూడా తనను నియమించలేదని విమర్శించారు. అందుకే పార్టీ కార్యక్రమాలు మానేసి బీసీల కోసం […]

Advertisement
Update:2016-06-20 02:30 IST

ఎన్నికలకు ముందు బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా చంద్రబాబు తెరపైకి తెచ్చారు. కానీ టీటీడీపీ అధికారంలోకి రాలేదు. ఈ తర్వాత ఆర్‌. కృష్ణయ్యను టీడీపీ పూర్తిగా విస్మరించింది. ఈ విషయంపై ఆర్‌ కృష్ణయ్య తనలోని అసంతృప్తిని ఒక మీడియా సంస్థ వద్ద వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన వారు… ఆ తర్వాత కనీసం ఫ్లోర్‌లీడర్‌గా కూడా తనను నియమించలేదని విమర్శించారు. అందుకే పార్టీ కార్యక్రమాలు మానేసి బీసీల కోసం పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. టీడీపీ వాడుకుని వదిలేసిందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు… ఆ విషయం ప్రజలకే తెలుసన్నారు. కానీ తన నోటితో ఆ మాట చెప్పలేనన్నారు. టీడీపీ జెండా మోస్తూ బీసీల కోసం పోరాడడం సాధ్యం కాదన్నారు.

తనను సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రకటించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చేది కాదన్నారు. తనను తెలంగాణలో బీసీ అభ్యర్థిగా ప్రకటించడం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎం అవడానికి కూడా దోహదపడిందని కృష్ణయ్య చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News