ప్రయివేటు స్కూళ్లు వద్దే వద్దు... గవర్నమెంటు బడిని తెరిపించిన గ్రామస్తులు!
ప్రయివేటు స్కూళ్ల ఫీజుల మోత, తల్లిదండ్రులు చేస్తున్న నిరసన ప్రదర్శనలు, ధర్నాలపై వార్తలను వింటున్నాం.,,చూస్తున్నాం. ఎవరేం చేసినా మాకు ఎదురు లేదు… అనుకునే ప్రయివేటు స్కూళ్లకు బుద్ది వచ్చేలా ఒక మంచి మార్పుకి శ్రీకారం చుట్టారు మెదక్ జిల్లా, జగ్‌దేవ్‌పూర్ మండలం, తీగుల్ గ్రామ పంచాయితీ వాసులు. వీరంతా సమావేశమై తమ గ్రామంలోని 30మంది విద్యార్థులను ప్రయివేటు స్కూళ్లకు పంపకూడదని, ప్రభుత్వ బడికే పంపాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, గ్రామ పంచాయితీ పరిధిలోని రామ్‌నగర్‌లో మూతపడి ఉన్న […]
ప్రయివేటు స్కూళ్ల ఫీజుల మోత, తల్లిదండ్రులు చేస్తున్న నిరసన ప్రదర్శనలు, ధర్నాలపై వార్తలను వింటున్నాం.,,చూస్తున్నాం. ఎవరేం చేసినా మాకు ఎదురు లేదు… అనుకునే ప్రయివేటు స్కూళ్లకు బుద్ది వచ్చేలా ఒక మంచి మార్పుకి శ్రీకారం చుట్టారు మెదక్ జిల్లా, జగ్‌దేవ్‌పూర్ మండలం, తీగుల్ గ్రామ పంచాయితీ వాసులు. వీరంతా సమావేశమై తమ గ్రామంలోని 30మంది విద్యార్థులను ప్రయివేటు స్కూళ్లకు పంపకూడదని, ప్రభుత్వ బడికే పంపాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, గ్రామ పంచాయితీ పరిధిలోని రామ్‌నగర్‌లో మూతపడి ఉన్న స్కూలుని తెరిపించారు కూడా.
ఈ స్కూలుకి ఇద్దరు టీచర్లు ఉన్నా, విద్యార్థులు సైతం ఇద్దరే ఉండటంతో రెండేళ్ల క్రితం బడిని మూసేశారు. ఉపాధ్యాయులను వేరే ప్రాంతాలకు డిప్యుటేషన్‌పై పంపారు. అయితే ఈ సంవత్సరం ఎలాగైనా తమ పిల్లలను ప్రభుత్వ బడికి మాత్రమే పంపాలని తీర్మానించుకున్న గ్రామస్తులు తమ నిర్ణయాన్ని మండల విద్యాధికారికి తెలియజేయగా ఆయన స్కూలుని తిరిగి తెరిపించే ఏర్పాట్లు చేశారు. డిప్యుటేషన్‌పై వెళ్లిన టీచర్లను వెనక్కు రప్పించారు. దీంతో శుక్రవారం ఆ ప్రభుత్వ బడి మళ్లీ మొదలైంది.
Click on Image to Read: