ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వెంకయ్య షాక్‌

ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలోకి రాజీనామా చేయకుండానే ఫిరాయించడం ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది. పబ్లిక్‌గానే పరాయి పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ సీఎం చంద్రబాబు ఈ విషయంలో అందరి కంటే ముందున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబుకు అత్యంత ఇష్టుడు అయిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఫిరాయింపుదారులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకపార్టీలో గెలిచి మరోపార్టీలోకి చేరే వారు ముందు పాత పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలన్నారు. పార్టీ ఫిరాయిస్తే వెంటనే పదవులు పోయేలా చట్టాన్ని […]

Advertisement
Update:2016-06-17 14:18 IST

ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలోకి రాజీనామా చేయకుండానే ఫిరాయించడం ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది. పబ్లిక్‌గానే పరాయి పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ సీఎం చంద్రబాబు ఈ విషయంలో అందరి కంటే ముందున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబుకు అత్యంత ఇష్టుడు అయిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఫిరాయింపుదారులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒకపార్టీలో గెలిచి మరోపార్టీలోకి చేరే వారు ముందు పాత పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలన్నారు. పార్టీ ఫిరాయిస్తే వెంటనే పదవులు పోయేలా చట్టాన్ని తీసుకురావాలని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారు. డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలవాలనుకోవడం దారుణమన్నారు. ఈపరిణామాలు సిగ్గుచేటన్నారు.

ఒక విధంగా చంద్రబాబుకు కేంద్రంలో గురువులాంటి వెంకయ్యనాయుడు ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రేపటి నుంచి భూమా నుంచి జ్యోతుల వరకు తాము చేసిన పనిని ఎలా సమర్ధించుకుంటారో!. అయినా ఇలాంటి నీతులు వెంకయ్యనాయుడు గాల్లో చెప్పే బదులు … చంద్రబాబు, కేసీఆర్‌ చెవిలో చెబితే బాగుంటుంది. ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని ముఖ్యమంత్రులకు చెబితే ఏపీ రాజకీయాలు కొద్దిమేరనైనా బాగుపడుతాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News