విశాఖ జిల్లా ఏఎస్పీ అనుమానాస్పద మృతి
విశాఖపట్నం జిల్లా పాడేరు అడిషనల్ ఎస్పీ శశికుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన తుపాకి పేలడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. తుపాకి పేలుడు శబ్దం విన్న సిబ్బంది వెళ్లి చూసే సరికి శిశికుమార్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలువదిలారు. ఏఎస్పీ బంగ్లాలోనే ఈ ఘటన జరిగింది. అయితే తుపాకీ మిస్ ఫైర్ అయిందా లేకుంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. శశికుమార్ తమిళనాడుకు చెందినవారు. శశికుమార్‌కు ఇంకా […]
విశాఖపట్నం జిల్లా పాడేరు అడిషనల్ ఎస్పీ శశికుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన తుపాకి పేలడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. తుపాకి పేలుడు శబ్దం విన్న సిబ్బంది వెళ్లి చూసే సరికి శిశికుమార్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలువదిలారు. ఏఎస్పీ బంగ్లాలోనే ఈ ఘటన జరిగింది. అయితే తుపాకీ మిస్ ఫైర్ అయిందా లేకుంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. శశికుమార్ తమిళనాడుకు చెందినవారు. శశికుమార్‌కు ఇంకా వివాహం కాలేదు. ఆరు నెలల క్రితమే పాడేరు ఏఎస్పీగా చార్జ్ తీసుకున్నారు.