పార్టీలపై క్రిష్ణయ్య వ్యాఖ్యలకు చంద్రబాబే కారణమా?
రాజకీయ పార్టీలపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలను అద్దెకొంపలుగా అభివర్ణించారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన బీసీ చైతన్య సదస్సులో ఆయన ఈ మాటలన్నారు. ఆర్. క్రిష్ణయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న విలేకరులు కంగుతిన్నారు. ఇప్పటికే టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్.క్రిష్ణయ్య ఎమ్మెల్యేగా కంటే.. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నా.. బీసీ సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం […]
Advertisement
రాజకీయ పార్టీలపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలను అద్దెకొంపలుగా అభివర్ణించారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన బీసీ చైతన్య సదస్సులో ఆయన ఈ మాటలన్నారు. ఆర్. క్రిష్ణయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న విలేకరులు కంగుతిన్నారు. ఇప్పటికే టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్.క్రిష్ణయ్య ఎమ్మెల్యేగా కంటే.. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నా.. బీసీ సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఆయన కేవలం మొక్కుబడిగా మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు తప్ప మనస్ఫూర్తిగా కాదు. ఈ విషయాన్నే ఆయనే పలుమార్లు స్వయంగా వెల్లడించారు కూడా. ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం వెనక టీడీపీలో చేరి తప్పు చేశాను అని మదనపడుతుండటమే కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు.
తనను టీడీపీ వాడుకుందని భావిస్తున్నారా?
తెలంగాణలో తాము గెలిస్తే.. సీఎం అభ్యర్థి నువ్వేనంటూ చంద్రబాబు హామీ ఇవ్వడంతో టీడీపీలో చేరారు ఆర్.క్రిష్ణయ్య. అప్పటిదాకా ఉద్యమనాయకుడిగా ఉన్న క్రిష్ణయ్య టీడీపీ ముందుచూపును పసిగట్టలేకపోయారు. తెలంగాణ పోరాటంలో ముందుంది టీఆర్ ఎస్… ప్రత్యేక రాష్ర్టాన్ని ఇచ్చింది కాంగ్రెస్! తెలంగాణ రాకుండా విశ్వప్రయత్నాలు చేసింది చంద్రబాబు. ఈ విషయం తెలంగాణలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ, ఇంత చిన్న లాజిక్ క్రిష్ణయ్య ఎలా మిస్ అయ్యారో ఎవరికీ తెలియడం లేదు. ఇవేమీ ఆలోచించకుండా బీసీలకు సీఎం పదవి అనగానే ఆయన చేరిపోయారు. తరువాతే అసలు రాజకీయాలు తెలిసి బాధపడ్డారు. తెలంగాణలో టీడీపీ దారుణంగా ఓడింది. తరువాత జరిగిన పరిణామాలతో ఆయన మరింత నొచ్చుకున్నారు. ఆయనకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవిగానీ, తెలంగాణ కేడర్‌లో కీలక పదవిగానీ దక్కలేదు. దీంతో ఆయనకు ప్రాధాన్యం తగ్గించారని భావించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల్లో తనను బాగా వాడుకున్న చంద్రబాబు, ఇప్పుడు సరైన ప్రాధాన్యం ఇవ్వని తీరుపై కలత చెందినట్లు సమాచారం. తాజాగా నిజామాబాద్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించినవేనని పలు బీసీ సంఘాల నేతలు విశ్లేషించుకుంటున్నారు.
Click on Image to Read:
Advertisement