సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కరరావు, రవీంద్రనాయక్, మాజీ ఎంపీ వివేక్ సోదరులు టీఆర్‌ఎస్‌లోచేరిన సందర్బంగా ముఖ్యమంత్రికేసీఆర్ కొన్ని కీలక విషయాలు చెప్పారు. తన ప్రభుత్వాన్నికూల్చేందుకు కాంగ్రెస్‌, టీడీపీ కలిసి కుట్రచేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్‌తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్వయంగా చెప్పారని వెల్లడించారు. ప్రభుత్వం కూల్చే కుట్ర జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తమ మద్దతు ఉంటుందని అసద్ […]

Advertisement
Update:2016-06-15 14:04 IST

కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కరరావు, రవీంద్రనాయక్, మాజీ ఎంపీ వివేక్ సోదరులు టీఆర్‌ఎస్‌లోచేరిన సందర్బంగా ముఖ్యమంత్రికేసీఆర్ కొన్ని కీలక విషయాలు చెప్పారు. తన ప్రభుత్వాన్నికూల్చేందుకు కాంగ్రెస్‌, టీడీపీ కలిసి కుట్రచేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్‌తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్వయంగా చెప్పారని వెల్లడించారు. ప్రభుత్వం కూల్చే కుట్ర జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తమ మద్దతు ఉంటుందని అసద్ చెప్పారని కేసీఆర్‌ వెల్లడించారు.

కొత్త రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోడానికి వాళ్లు కుట్ర పన్నుతున్నారని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. బెర్లిన్ గోడ పగలగొట్టి జర్మనీ ఏకమైనట్లుగా తెలుగు రాష్ట్రాలు మళ్లీ ఏకమవుతాయని చంద్రబాబు అన్నారని.. దానికి ఈ కుట్రే నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉందన్నారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకున్నప్పుడు జానారెడ్డి ఏం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. విజయశాంతి, అరవిందరెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఏం నీతి? మీరు చేస్తే సంసారం.. తాము చేస్తే వ్యభిచారమా అని కేసీఆర్ ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీయే భ్రష్టుపట్టిపోతుందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News