నాకు లేరా భార్యాపిల్లలు... మొండిగా మాట్లాడితే ఇంటికి పంపిస్తా...

ఏపీ గెజిటెడ్ అధికారుల ఫోరం నేతపై సీఎం చంద్రబాబు రుసరుసలాడారు. హైదరాబాద్‌ నుంచి తమను తరలించే ప్రక్రియను ఆరునెలలు వాయిదా వేయాలని సీఎంను కలిసేందుకు కొందరు అధికారులు వచ్చారు. ఈ సందర్భంగా వారి వినతిపై సీఎం ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఉద్యోగుల తరలింపు ప్రక్రియను అడ్డుకోవాలంటూ బీజేపీ నేత పురందేశ్వరిని కూడా కొందరు ఉద్యోగులు కలిసిన నేపథ్యంలో దాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు సమావేశంలో గెజిటెడ్ అధికారుల ఫోరం నేతలపై ఆ కోపం బయటపెట్టారు. ఉద్యోగుల తరలింపుపై […]

Advertisement
Update:2016-06-11 03:59 IST

ఏపీ గెజిటెడ్ అధికారుల ఫోరం నేతపై సీఎం చంద్రబాబు రుసరుసలాడారు. హైదరాబాద్‌ నుంచి తమను తరలించే ప్రక్రియను ఆరునెలలు వాయిదా వేయాలని సీఎంను కలిసేందుకు కొందరు అధికారులు వచ్చారు. ఈ సందర్భంగా వారి వినతిపై సీఎం ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఉద్యోగుల తరలింపు ప్రక్రియను అడ్డుకోవాలంటూ బీజేపీ నేత పురందేశ్వరిని కూడా కొందరు ఉద్యోగులు కలిసిన నేపథ్యంలో దాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు సమావేశంలో గెజిటెడ్ అధికారుల ఫోరం నేతలపై ఆ కోపం బయటపెట్టారు.

ఉద్యోగుల తరలింపుపై రోడ్డు మ్యాప్ ఇవ్వలేదని, గందరగోళ పరిస్థితి ఉందని, ఉద్యోగులకు కుటుంబ సమస్యలున్నాయని ఫోరం అధ్యక్షుడు ఏవీ పటేల్ వ్యాఖ్యానించగానే సీఎంకు కోపం కట్టలు తెంచుకుంది. ”ఏం మాట్లాడుతున్నావ్… సీఎంతో ఎలా మాట్లాడాలో తెలియదా?. ఈ విధంగా ఇష్టానుసారం మాట్లాడితే ఇంటికి పంపిస్తా. ఇప్పుడే సస్పెండ్ చేస్తా.. జాగ్రత్త” అని వార్నింగ్ ఇచ్చారు. ”తరలింపు వద్దని ప్రతిపక్షనాయకులను కలుస్తారా?. జేఏసీ పెట్టి పోరాటం చేస్తామంటారా?. ఏం పోరాడుతారు” అంటూ అసహనం వ్యక్తం చేశారు. ”ఏం నాకు లేరా భార్య పిల్లలు, వారిని వదిలేసి నేను రావడంలేదా” అని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. సీఎం మాటలతో నొచ్చుకున్న ఉద్యోగ సంఘాల నేతలు మారుమాట్లాడకుండా బయటకువచ్చేశారు. కుటుంబసభ్యులతో ఫైవ్ స్టార్ హోటల్లో కాపురం పెట్టిన సీఎంకు తమలాంటి చిన్న ఉద్యోగుల కుటుంబ సమస్యలు ఏం తెలుస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు వాపోయారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News