జగన్ బస చేసిన గెస్ట్ హౌస్ ముట్టడి... గురువారమే విడుదలైన ప్రసాద్
ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును చెప్పులతో కొడితే తప్పేంటని జగన్ ప్రశ్నించడంపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అనంతపురంలో జరుగుతున్న జగన్ రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కదిరిలో శనివారం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కదిరిలో జగన్ బస చేసిన గెస్ట్ హౌస్ మందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. గెస్ట్ హౌస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. గెస్ట్ హౌస్ ముందే చాలా […]
ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును చెప్పులతో కొడితే తప్పేంటని జగన్ ప్రశ్నించడంపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అనంతపురంలో జరుగుతున్న జగన్ రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కదిరిలో శనివారం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కదిరిలో జగన్ బస చేసిన గెస్ట్ హౌస్ మందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. గెస్ట్ హౌస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. గెస్ట్ హౌస్ ముందే చాలా సేపు కందికుంట ప్రసాద్ తన అనుచరులతో కలిసి బైఠాయించారు. మరోసారి చంద్రబాబును చెప్పులతో కొట్టాలని పిలుపునిస్తే జగన్ పర్యటనను అడ్డుకుంటామని టీడీపీ నేత అన్నారు. కందికుంట వెంకటప్రసాద్ గురువారమే జైలు నుంచి బయటకు వచ్చారు. తప్పుడు డీడీలతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 10కోట్ల కుంభకోణానికి ప్రసాద్ పాల్పడగా ఇటీవలే సీబీఐ కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే పై కోర్టులో ప్రసాద్ బెయిల్ తెచ్చుకుని గురువారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
Click on Image to Read: