ప్రాణం తీసిన రాజకీయ వైరం!
రాష్ర్ట ఆవిర్భావ వేడుకలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా టీఆర్ ఎస్ – సీపీఐ కార్యకర్తలు పరస్పరం చేసుకున్న దాడుల్లో 60 ఏళ్ల గులాబీ కార్యకర్త కన్నుమూశారు. చిన్న వాగ్వాదంతో మొదలైన గొడవ.. రెండు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. వివరాలు.. ఖమ్మం జిల్లా గూడురుపాడులో జరిగిన ఈ ఘటనలో హింస చోటుచేసుకుంది. ఈ ఘటనలో సత్తి సంగం (60) అనే టీఆర్‌ఎస్ కార్యకర్త మరణించగా.. పదుల […]
Advertisement
రాష్ర్ట ఆవిర్భావ వేడుకలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా టీఆర్ ఎస్ – సీపీఐ కార్యకర్తలు పరస్పరం చేసుకున్న దాడుల్లో 60 ఏళ్ల గులాబీ కార్యకర్త కన్నుమూశారు. చిన్న వాగ్వాదంతో మొదలైన గొడవ.. రెండు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. వివరాలు.. ఖమ్మం జిల్లా గూడురుపాడులో జరిగిన ఈ ఘటనలో హింస చోటుచేసుకుంది. ఈ ఘటనలో సత్తి సంగం (60) అనే టీఆర్‌ఎస్ కార్యకర్త మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం గ్రామంలో తెలంగాణ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తారాజువ్వలు, బాణసంచా పేల్చారు. ఈ గ్రామంలో ఇప్పటికే సీపీఐ – టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. ఉదయంపూట గులాబీ కార్యకర్తలు పేలుస్తున్న తారాజువ్వల నిప్పురవ్వలు గడ్డివాములపై పడుతున్నాయని సీపీఐ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది.
మధ్యాహ్నానికి ఇది చినికి చినికి గాలివానగా మారింది. రెండు వర్గాలవారు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడం మొదలైంది. ఇదే సమయంలో సీపీఐ కార్యకర్తల వైపునుంచి వచ్చిన ఓ పెద్ద రాయి సత్తి సంగెం (60) అనే టీఆర్ ఎస్ కార్యకర్తకు బలంగా తగిలింది. అంతే.. అతడు అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలువిడిచాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదని టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న ఏఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ సురేష్‌కుమార్ గూడురుపాడుకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. కాగా, దాడులకు పాల్పడ్డ సీపీఐ నేతలు, కార్యకర్తలపై చర్య తీసుకున్నాకే సంగం మృతదేహాన్ని తరలించాలంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించారు.
Advertisement