కలకలం... కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుపై ఎన్డీటీవి సంచలన కథనం

ఆయుధాల డీలర్‌ సంజయ్‌ భండారితో సోనియా అల్లుడు రాబర్ట్‌వాద్రాకి వున్న సంబంధాలపై జరుగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. సంజయ్‌ భండారిని బినామీగా పెట్టుకుని లండన్‌లో రాబర్ట్‌వాద్రా ఖరీదైన భారీ భవంతిని కొనుగోలు చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. భండారి ఇంటిపై దర్యాప్తు అధికారులు నిర్వహించిన దాడులలో రాబర్ట్‌వాద్రాతో అతడికి ఉన్న సంబంధాలపై అనేక కీలక ఆధారాలు లభించాయి. అయితే ఇక్కడే దర్యాప్తు అధికారులు మరో సంచలన విషయాన్ని కూడా గుర్తించినట్లు జాతీయ ఇంగ్లీష్‌ న్యూస్‌ ఛానల్‌ […]

Advertisement
Update:2016-06-02 04:49 IST

ఆయుధాల డీలర్‌ సంజయ్‌ భండారితో సోనియా అల్లుడు రాబర్ట్‌వాద్రాకి వున్న సంబంధాలపై జరుగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. సంజయ్‌ భండారిని బినామీగా పెట్టుకుని లండన్‌లో రాబర్ట్‌వాద్రా ఖరీదైన భారీ భవంతిని కొనుగోలు చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. భండారి ఇంటిపై దర్యాప్తు అధికారులు నిర్వహించిన దాడులలో రాబర్ట్‌వాద్రాతో అతడికి ఉన్న సంబంధాలపై అనేక కీలక ఆధారాలు లభించాయి. అయితే ఇక్కడే దర్యాప్తు అధికారులు మరో సంచలన విషయాన్ని కూడా గుర్తించినట్లు జాతీయ ఇంగ్లీష్‌ న్యూస్‌ ఛానల్‌ ఎన్డీటీవి కథనాన్ని ప్రసారం చేసింది.

సోదాలలో ఆయుధాల డీలర్‌ సంజయ్‌ భండారితో టీడీపీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు ఓఎస్‌డీగా వున్న అప్పారావు వందలసార్లు ఫోన్‌ సంభాషణలు జరిపినట్లు గుర్తించారు. ఏడాది కాలంలో ఏకంగా 355 సార్లు భండారితో అప్పారావు రహస్య ఫోన్‌ సంభాషణలు జరిపారు. అప్పారావు రెండేళ్లుగా అశోక్‌ గజపతిరాజు దగ్గరే పనిచేస్తున్నారు. ఈ కథనంపై స్పందించిన అప్పారావు కీలక అంశాలను బహిర్గతం చేశారు. బండారితో తాను ఫోన్‌ సంభాషణలు జరిపిన మాట వాస్తవమేనని వెళ్లడించారు. ఆయుధాల డీలర్‌ సంజయ్‌ భండారి కేంద్రమంత్రి గజపతిరాజును కూడా మూడు నాలుగు సార్లు కలిసారని బహిర్గతం చేశారు. ఎన్టీటీవి అశోక్‌ గజపతిరాజు, సంజయ్‌ భండారి కలిసి దిగిన ఫొటోలను కూడా ప్రముఖంగా ప్రచారం చేసింది.

ఇక్కడే టీడీపీ కేంద్రమంత్రిపైనా అనుమానాలు ఊపందుకున్నాయి. ఆయుధాల డీలర్‌ సంజయ్‌ భండారి వ్యవహరశైలిని ముందే పసిగట్టిన ఇంటెలిజెన్స్‌ అతడిని డిఫెన్స్‌ కార్యాలయాలవైపు రానివ్వద్దని ముందే హెచ్చరించింది. అయినప్పటికి టీడీపీ కేంద్రమంత్రి, ఆయన ఓఎస్‌డీలు భండారితో ఇంత క్లోజ్‌గా ఎలా వ్యవహరించారన్నదానిపై దర్యాప్తు అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఏడాదిలో 355 సార్లు ఆయుధాల డీలర్‌కు ఫోన్‌ చేయడమంటే దీని వెనుక ఏదో భారీ వ్యవహారమే నడుస్తూవుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కథనాలపై ఉలిక్కి పడ్డ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు గురువారం మీడియా సమావేశం ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారం చాలా దూరమే పోయేలా వుందని భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News