ఏడవతరగతి అమ్మాయికి నాసా ఆహ్వానం

ఖమ్మం ఆర్డీసీ బస్టాండ్‌ సెంటర్‌లోఫ్యాన్సీ షాపు నడుపుకుంటున్నవేముల శ్యామ్‌కూతురు శ్రావ్య నాసాపరిశోధనాకేంద్రాన్ని దర్శించడానికి, అందులో ఎనిమిదిరోజుల పాటు నాసా శాస్రవేత్తలతో కలిసి నాసాగురించి తెలుసుకోవడానికి అవకాశం దక్కించుకుంది. దీంతోపాటు ఒబామాని కలిసిమాట్లాడే అవకాశంతోపాటు ఆయనతో కలిసి భోజనం చేసే అదృష్టంకూడా ఈ చిన్నారి అమ్మాయికి దక్కింది.  ఖమ్మంలోని ఓ స్కూల్‌లో ఏడవతరగతి చదువుతున్న ఈ శ్రావ్యకు చిన్నప్పటినుంచి సైన్స్‌ అంటే చాలా ఇష్టం.ముఖ్యంగా ఆస్ర్టానమిమీద విపరీతమైన ఉత్సాహం. ఎప్పటికైనా నాసాలో సైంటిస్ట్‌గా చేరాలనేది ఆమె కల. ప్రతి […]

Advertisement
Update:2016-06-01 06:47 IST

ఖమ్మం ఆర్డీసీ బస్టాండ్‌ సెంటర్‌లోఫ్యాన్సీ షాపు నడుపుకుంటున్నవేముల శ్యామ్‌కూతురు శ్రావ్య నాసాపరిశోధనాకేంద్రాన్ని దర్శించడానికి, అందులో ఎనిమిదిరోజుల పాటు నాసా శాస్రవేత్తలతో కలిసి నాసాగురించి తెలుసుకోవడానికి అవకాశం దక్కించుకుంది. దీంతోపాటు ఒబామాని కలిసిమాట్లాడే అవకాశంతోపాటు ఆయనతో కలిసి భోజనం చేసే అదృష్టంకూడా ఈ చిన్నారి అమ్మాయికి దక్కింది.

ఖమ్మంలోని ఓ స్కూల్‌లో ఏడవతరగతి చదువుతున్న ఈ శ్రావ్యకు చిన్నప్పటినుంచి సైన్స్‌ అంటే చాలా ఇష్టం.ముఖ్యంగా ఆస్ర్టానమిమీద విపరీతమైన ఉత్సాహం. ఎప్పటికైనా నాసాలో సైంటిస్ట్‌గా చేరాలనేది ఆమె కల.

ప్రతి సంవత్సరం నేషనల్‌ లెవల్లో ఆస్ర్టానమి ఒలంపియాడ్‌ నిర్వహించే పరీక్షలో శ్రావ్య పాల్గొని జాతీయ స్థాయిలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. కొన్ని లక్షలమంది ఈ పరీక్ష రాస్తారు. వాళ్లలోనుంచి ఒకటి, రెండు ర్యాంకులు పొందినవారిని అమెరికాలోని నాసాకు పంపుతారు. అలా నాసాని సందర్శించే అవకాశం దక్కించుకుంది ఈ చిన్నారి శ్రావ్య.

Tags:    
Advertisement

Similar News