బాబుపై హరికృష్ణ ఫైర్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై నందమూరి హరికృష్ణ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాఇస్తామని చెప్పి మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన వారు ఇప్పుడేం చేస్తున్నారంటూ పరోక్షంగా చంద్రబాబుపై అటాక్‌ చేశారు హరి. ప్రత్యేకహోదా సాధిస్తేనే సిసలైన తెలుగు బిడ్డలం అవుతాయని చెప్పారు.  ప్రతి తెలుగువాడు ప్రత్యేక హోదా కోసం శపథం చేసి ముందుకు నడవాలన్నారు. అప్పుడే అన్నగారి ఆశయం నెరవేరుతుందని చెప్పారు. మహానాడుకు ఎందుకు వెళ్లలేదో కూడా హరి […]

Advertisement
Update:2016-05-28 04:01 IST

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై నందమూరి హరికృష్ణ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాఇస్తామని చెప్పి మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన వారు ఇప్పుడేం చేస్తున్నారంటూ పరోక్షంగా చంద్రబాబుపై అటాక్‌ చేశారు హరి. ప్రత్యేకహోదా సాధిస్తేనే సిసలైన తెలుగు బిడ్డలం అవుతాయని చెప్పారు. ప్రతి తెలుగువాడు ప్రత్యేక హోదా కోసం శపథం చేసి ముందుకు నడవాలన్నారు. అప్పుడే అన్నగారి ఆశయం నెరవేరుతుందని చెప్పారు.

మహానాడుకు ఎందుకు వెళ్లలేదో కూడా హరి చెప్పారు. తనకు ఎన్టీఆర్‌కు నివాళర్పించడం కంటే ముఖ్యమైన కార్యక్రమం ఏదీ లేదని అందుకే మహానాడుకు హాజరుకాలేదని చెప్పారు. ఒకవిధంగా చంద్రబాబు వైఖరిపై తనకున్న అసంతృప్తిని హరికృష్ణ బయటపెట్టారు. ప్రత్యేక హోదా తెస్తామన్న వారు ఏంచేస్తున్నారని ప్రశ్నించడం ద్వారా చంద్రబాబు హోదా విషయంలో రాజీపడ్డారన్న అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించడమే తనకు ముఖ్యమని అందుకే మహానాడుకు హాజరుకాలేదని చెప్పడం వెనుక కూడా అసలు కారణం వేరే ఉందని భావిస్తున్నారు. సరైన రీతిలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను టీడీపీ నాయకత్వం మహానాడుకు ఆహ్వానించలేదంటున్నారు. అందుకే హరి అసంతృప్తితో ఉన్నారని భావిస్తున్నారు.

హరికృష్ణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా వున్నారు. అయినప్పటికి పొలిట్ బ్యూరో సమావేశాలకు హరికృష్ణ హాజరుకావడంలేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News