ఓటుకు నోటు మ‌త్త‌య్య అరెస్ట్!

అశోక్ అలియాస్ జెరుస‌లేం మ‌త్త‌య్య‌.. ఓటుకు నోటు కేసు నిందితుల్లో ఒక‌డు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి ప్ర‌య‌త్నించి ఏపీకి పారిపోయిన వ్య‌క్తి. అక్క‌డికెళ్లి ఏకంగా తెలంగాణ సీఎంపైనే కేసు పెట్టిన ఘ‌నుడు.  ఈ కేసు జాతీయ‌స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే! ఈ కేసు పుణ్య‌మా అని చంద్ర‌బాబు ప‌రువు గంగ‌లో క‌లిసినంత ప‌నైంది. ఎందుకంటే.. ఆ కేసుతో చంద్ర‌బాబుకు సంబంధ‌ముందంటూ ప‌లు వీడియోలు, ఆడియోలు వెలుగుచూడ‌ట‌మే ఇందుకు కారణం. ఆ స‌మ‌యంలో కేసులో ప్ర‌ధాన నిందితుడు, […]

Advertisement
Update:2016-05-26 06:42 IST
అశోక్ అలియాస్ జెరుస‌లేం మ‌త్త‌య్య‌.. ఓటుకు నోటు కేసు నిందితుల్లో ఒక‌డు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి ప్ర‌య‌త్నించి ఏపీకి పారిపోయిన వ్య‌క్తి. అక్క‌డికెళ్లి ఏకంగా తెలంగాణ సీఎంపైనే కేసు పెట్టిన ఘ‌నుడు. ఈ కేసు జాతీయ‌స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే! ఈ కేసు పుణ్య‌మా అని చంద్ర‌బాబు ప‌రువు గంగ‌లో క‌లిసినంత ప‌నైంది. ఎందుకంటే.. ఆ కేసుతో చంద్ర‌బాబుకు సంబంధ‌ముందంటూ ప‌లు వీడియోలు, ఆడియోలు వెలుగుచూడ‌ట‌మే ఇందుకు కారణం. ఆ స‌మ‌యంలో కేసులో ప్ర‌ధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకోగా.. మిగిలిన‌వారు పారిపోయారు.
అలా ఏపీకి పారిపోయిన మ‌త్త‌య్య అక్క‌డ‌ కొంత‌కాలం త‌ల‌దాచుకుని, ఆ త‌రువాత కోర్టు సాయంతో అరెస్టు నుంచి మిన‌హాయింపు తెచ్చుకున్నాడు. కానీ, పోలీసులు తాజాగా మ‌త్త‌య్య‌ను అరెస్టు చేశారు. ఈయ‌న అరెస్టు కొద్దిసేపు మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. కొంప‌దీసి తెలంగాణ పోలీసులు ఓటుకు నోటు కేసు ఫైల్ దుమ్ము దులిపారా? ఏంటి? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే, ఇందుకు కార‌ణాలు లేక‌పోలేదు. గ‌తేడాది మ‌హానాడు ముగిశాకే ఓటుకు నోటు కేసు వెలుగుచూసింది. శుక్ర‌వారం నుంచి మ‌హానాడు తిరుప‌తిలో మొద‌లు కానుంది. ఈ స‌మ‌యంలో మ‌త్త‌య్య అరెస్టు కావ‌డం కాసేపు కల‌క‌లం రేపింది.
అరెస్టు చేసింది అందుకు కాదు..!
జెరుస‌లేం మ‌త్త‌య్య మొద‌టి నుంచి వివాదాస్ప‌ద వ్య‌క్తిగానే గుర్తింపు పొందాడు. 2006లో ఉద్యోగాలిప్పిస్తాన‌ని కొంద‌రు నిరుద్యోగుల‌కు ఆశ‌చూపాడు. అందుకు చాలా ఖ‌ర్చ‌వుతుంది.. అంటూ ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేసి ముఖం చాటేశాడు. దీంతో బాధితులంతా పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అప్ప‌టి నుంచి ఈకేసు ద‌ర్యాప్తులోనే ఉంది. ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల ద‌ర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు గురువారం మ‌త్తయ్య‌ను ఉప్ప‌ల్‌లో అరెస్టు చేశారు. న్యాయ‌మూర్తి ముందు హాజ‌రుప‌ర‌చ‌గా.. ఆయ‌న మ‌త్త‌య్య‌కు రిమాండ్ విధించారు. దీంతో మ‌త్త‌య్య‌ను పోలీసులు చర్ల‌పల్లి కారాగారానికి త‌ర‌లించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News