చింతమనేని రికార్డింగ్ డ్యాన్స్...ఈ సారి పోలీసుల వంతు
ప్రభుత్వం విప్,టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. మహిళా అధికారులు, అంగన్ వాడీ మహిళలు, అటవీ సిబ్బందిపై ప్రతాపం చూపిన చింతమనేని ఈసారి పోలీసులపైనే చిందులు తొక్కారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం ఆరుగొలనుపేటలో తిరునాళ్ల సందర్భంగా టీడీపీ కార్యకర్తలు రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రికార్డింగ్ డ్యాన్స్‌ను అడ్డుకున్నారు. తమ్ముళ్లు చింతమనేనికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన చింతమనేని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజలే ఇష్టపడి రికార్డింగ్ […]
ప్రభుత్వం విప్,టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. మహిళా అధికారులు, అంగన్ వాడీ మహిళలు, అటవీ సిబ్బందిపై ప్రతాపం చూపిన చింతమనేని ఈసారి పోలీసులపైనే చిందులు తొక్కారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం ఆరుగొలనుపేటలో తిరునాళ్ల సందర్భంగా టీడీపీ కార్యకర్తలు రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రికార్డింగ్ డ్యాన్స్‌ను అడ్డుకున్నారు.
తమ్ముళ్లు చింతమనేనికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన చింతమనేని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజలే ఇష్టపడి రికార్డింగ్ డ్యాన్స్‌లు వేసుకుంటుంటే మధ్యలో మీ అభ్యంతరం ఏంటంటూ హల్ చల్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించి తీరుతామన్నారు. దాదాపు గంట పాటు పోలీసులతో తగువుపడ్డారు. చింతమనేనికి తోడుకు టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో పరిస్థితి అదుపుతప్పినట్టు కనిపించింది. దీంతో వెంటనే అదనపు బలగాలను రప్పించారు.
రికార్డింగ్ డ్యాన్స్‌లకు అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేయడం, అదనపు బలగాలు రంగంలోకి దిగడంతో చింతమనేని వెనక్కు తగ్గారు. ఉన్నతాధికారుల వద్దే తేల్చుకుంటానంటూ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత రాత్రి ఈ ఘటన జరిగింది.
Click on Image to Read: