అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది మీరే... వెన్నుపోటుతో కలిపి పదేళ్లు ఏంచేశారు?

ముద్రగడ పద్మనాభం వెనుక జగన్‌ ఉన్నారంటూ పార్టీ నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించడంపై కాపు నేత ముద్రగడ తీవ్రంగా స్పందించారు. మరోసారి చంద్రబాబుకు బహిరంగలేఖ రాశారు. తాను జగన్ పక్షం అని నిరూపిస్తే ఉద్యమం ఆపేస్తానని ఒకవేళ నిరూపించలేకపోతే చంద్రబాబు ఏం చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టాలని ఆదేశించి… ఇప్పుడు మాత్రం తనకు తెలియదంటూ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. జగన్ వయసు తన రాజకీయ జీవితమంత లేదని…అలాంటి వ్యక్తి […]

Advertisement
Update:2016-05-25 09:18 IST

ముద్రగడ పద్మనాభం వెనుక జగన్‌ ఉన్నారంటూ పార్టీ నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించడంపై కాపు నేత ముద్రగడ తీవ్రంగా స్పందించారు. మరోసారి చంద్రబాబుకు బహిరంగలేఖ రాశారు. తాను జగన్ పక్షం అని నిరూపిస్తే ఉద్యమం ఆపేస్తానని ఒకవేళ నిరూపించలేకపోతే చంద్రబాబు ఏం చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టాలని ఆదేశించి… ఇప్పుడు మాత్రం తనకు తెలియదంటూ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. జగన్ వయసు తన రాజకీయ జీవితమంత లేదని…అలాంటి వ్యక్తి తనకు సలహాలు ఇవ్వగలరా అని అన్నారు. అన్నదమ్ముళ్లా ఉన్న దళితుల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇప్పుడు కాపుల మధ్య కూడా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబులాగా దుష్ట ఆలోచనలు చేసే మనస్తత్వం తనది కాదన్నారు. తనలాగా ఎప్పుడైనా ప్రజల కోసం చంద్రబాబు ఏపదవికైనా రాజీనామా చేశారా అని నిలదీశారు.

‘గతంలో రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదని మీరంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన జీవో నెంబర్.30 సాధించిన విషయం మీకు తెలియదా? అది చెత్త జీవో అన్నది మీరు కాదా?” అని ప్రశ్నించారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఓ పెద్దాయనతో రిట్ వేయించి ఆ జీవోపై స్టే తెప్పించింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఆ తర్వాత 1995లో హైకోర్టు ఫుల్ బెంచ్ మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. ”ఆ రోజు నుంచి వెన్నుపోటుతో కలిపి పదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు. మీ ఏలుబడిలో ఆ తీర్పును ఎందుకు అమలు చేయలేదు. కాపులకు ఎన్నో చేశానంటున్న మీరు జీవో 30కి వ్యతిరేకంగా కోర్టుకు ఎందుకు వెళ్లారు?.’ అని ముద్రగడ తన లేఖలో ప్రశ్నించారు. కాపులను కరివేపాకులా వాడుకోవడం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటేనని అన్నారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు ముద్రగడ.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News