అయ్యప్పస్వామి భక్తులపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల సమావేశంలోనే ఈవ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేవాదాయశాఖ ఆదాయం గురించి మాట్లాడుతూ భక్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏమన్నారంటే” దేవాదాయ శాఖ ఆదాయం బాగా పెరిగింది. ఎందుకు పెరిగిందో తెలుసా?. కష్టమొస్తే జనం దేవుడిని నమ్ముకుంటున్నారు. మన ఒక పవిత్రమైన సిస్టమ్‌లో హుండీలు పెట్టాం. ఎక్కువ తప్పులు చేసిన వాడు ఎక్కువ డబ్బులు వేస్తున్నాడు. అందుకే ఎక్కువ ఆదాయం వస్తోంది.ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి. గుళ్లు, చర్చిలు, […]

Advertisement
Update:2016-05-25 07:19 IST

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల సమావేశంలోనే ఈవ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేవాదాయశాఖ ఆదాయం గురించి మాట్లాడుతూ భక్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏమన్నారంటే” దేవాదాయ శాఖ ఆదాయం బాగా పెరిగింది. ఎందుకు పెరిగిందో తెలుసా?. కష్టమొస్తే జనం దేవుడిని నమ్ముకుంటున్నారు. మన ఒక పవిత్రమైన సిస్టమ్‌లో హుండీలు పెట్టాం. ఎక్కువ తప్పులు చేసిన వాడు ఎక్కువ డబ్బులు వేస్తున్నాడు. అందుకే ఎక్కువ ఆదాయం వస్తోంది.ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి. గుళ్లు, చర్చిలు, మసీలు లేకపోతే చాలా మంది పిచ్చివాళ్లు అయ్యేవారు. కొంత మంది అయ్యప్పస్వామి దగ్గరకు వెళ్తుంటారు. కనీసం 40 రోజులైనా మద్యం తాగకుండా ఉండాలని!. బ్రాందీ, విస్కీ తాగడం తగ్గడానికి కూడా ఇదే కారణం. అందుకే దీక్షలు చేస్తున్న 40రోజులు మద్యం వినియోగం బాగా తగ్గిపోతోంది” అంటూ కామెంట్స్ చేశారు.

బాబు వ్యాఖ్యలు చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. అంటే అయ్యప్పస్వామికి వెళ్లేవారంతా మద్యం సేవించకుండా ఉండేందుకే వెళ్తారని చంద్రబాబు భావిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. జనం తప్పులు చేయడం వల్లే దేవాదాయ శాఖకు ఎక్కువ ఆదాయం వస్తోందని చెప్పడం బట్టి హుండీల ద్వారా వస్తున్న సొమ్మంతా పాపపు సొమ్ము అని సీఎం చెప్పదలుచుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ల సమావేశంలో మరో విషయం కూడా చంద్రబాబు చెప్పారు. తాను సంతకాలు చేస్తున్న పైళ్లలో ప్రజాఅవసరాలకు సంబంధించినవి ఉండడం లేదన్నారు. కింది స్థాయి అధికారులు తమకు అవసరమైన ఫైళ్లను మాత్రం తన ముందు ఉంచుతున్నారని తాను కూడా వాటిపైనే సంతకాలు చేయాల్సి వస్తోందన్నారు. పక్కరాష్ట్రాల అభివృద్ధి చూసి అసూయ కలుగుతోందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News