అప్పుడే మొద‌లైందా? కొత్త‌ప‌ల్లికీ కొత్త‌పెళ్లికొడుకు మ‌ర్యాద‌లేనా?

ఇటీవ‌ల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బ‌రాయుడికి అప్పుడే పాత టీడీపీ నేత‌ల నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతోంది. చంద్ర‌బాబు ఆదేశాల‌తో కొత్ల‌ప‌ల్లి రాక‌ను అడ్డుకోలేక‌పోయిన నేత‌లు… పొగ‌పెట్టేందుకు మాత్రం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. న‌ర‌సాపురం టీడీపీ ఎమ్మెల్యే మాధ‌వ‌నాయుడు, ఆయ‌న అనుచ‌రులు కొత్త‌ప‌ల్లిపై ర‌గిలిపోతున్నారు. పార్టీలో చేరిన కొత్త‌ప‌ల్లి వ‌ర్గం ఎక్కువ చేస్తే తిర‌గ‌బ‌డాల‌ని త‌న అనుచ‌రుల‌కు చెబుతున్నారు ఎమ్మెల్యే. పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన వారిని చూసి కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదంటున్నారు. కొత్త‌ప‌ల్లి తాను […]

Advertisement
Update:2016-05-21 05:22 IST

ఇటీవ‌ల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బ‌రాయుడికి అప్పుడే పాత టీడీపీ నేత‌ల నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతోంది. చంద్ర‌బాబు ఆదేశాల‌తో కొత్ల‌ప‌ల్లి రాక‌ను అడ్డుకోలేక‌పోయిన నేత‌లు… పొగ‌పెట్టేందుకు మాత్రం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. న‌ర‌సాపురం టీడీపీ ఎమ్మెల్యే మాధ‌వ‌నాయుడు, ఆయ‌న అనుచ‌రులు కొత్త‌ప‌ల్లిపై ర‌గిలిపోతున్నారు. పార్టీలో చేరిన కొత్త‌ప‌ల్లి వ‌ర్గం ఎక్కువ చేస్తే తిర‌గ‌బ‌డాల‌ని త‌న అనుచ‌రుల‌కు చెబుతున్నారు ఎమ్మెల్యే. పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన వారిని చూసి కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదంటున్నారు.

కొత్త‌ప‌ల్లి తాను పార్టీలో చేరే కార్య‌క్ర‌మానికి స్వ‌యంగా వెళ్లి మాధ‌వ‌నాయుడిని ఆహ్వానించారు. అయన తిర‌స్క‌రించారు. మీరు వెళ్లి పార్టీలో చేరండి… ఏం చేయాలో త‌ర్వాత ఆలోచిస్తామంటూ ఇన్‌డైరెక్ట్‌గా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. మాధ‌వనాయుడు వ‌ర్గం ఇస్తున్న వార్నింగ్‌ల‌కు కొత్త‌ప‌ల్లి వ‌ర్గం నుంచి ఎలాంటి కౌంట‌ర్ రావ‌డం లేదు. ఒక‌ప్పుడు టీడీపీలో మంత్రిగా చేసిన‌ప్ప‌టికీ ప‌దేప‌దే పార్టీలు మార‌డం వ‌ల్ల కొత్త‌ప‌ల్లి టీడీపీలో స్థాన బ‌లం కోల్పోయార‌ని చెబుతున్నారు. టీడీపీ, ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ, ఇప్పుడు తిరిగి టీడీపీ ఇలా ఏడేళ్ల కాలంలో ఏకంగా నాలుగు పార్టీలను కొత్త‌ప‌ల్లి మారారు. అధికారం కోసం కొత్త‌ప‌ల్లి ప‌దేప‌దే పార్టీలు మారుతుంటార‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు మండిప‌డుతున్నారు. కొత్త‌ప‌ల్లి టీడీపీలో చేర‌డాన్ని ఆయ‌న సోద‌రుడు జాన‌కిరామ్ కూడా వ్య‌తిరేకిస్తున్నారు. అయితే ఇలా టీడీపీ నేతల నుంచి తనపై జరుగుతున్న దాడిని ఎలా ఎదుర్కొవాలన్న దానిపై కొత్తపల్లి తర్జనభర్జన పడుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News