సీఎం ర‌మేష్ ఇంగ్లీష్.. గంగ‌లో క‌లిసిన ప‌రువు

టీడీపీ నేత‌ల‌కు ఇంగ్లీష్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. గోదావ‌రి పుష్క‌రాల స‌మ‌యంలో తొక్కిస‌లాట జ‌రిగి 30 మంది చ‌నిపోయిన ఘ‌ట‌న‌పై ప్ర‌ముఖ ఇంగ్లీష్ ఛాన‌ల్ టైమ్స్ నౌ చ‌ర్చ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు, విద్యాసంస్థ‌ల అథినేత‌లు అయిన ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి, మంత్రి నారాయ‌ణ చ‌ర్చ‌లో పాల్గొన్నారు. అయితే యాంక‌ర్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక కంగారుప‌డ్డారు. మంత్రులిద్ద‌రూ మాట్లాడిన ఇంగ్లీష్‌పై పెద్దెత్తున సెటైర్లు ప‌డ్డాయి.  ఆ దెబ్బ‌కు ఇక‌పై గ‌ల్లా జ‌య‌దేవ్ మిన‌హా ఎవ‌రూ ఇంగ్లీష్ ఛాన‌ళ్ల […]

Advertisement
Update:2016-05-12 05:42 IST

టీడీపీ నేత‌ల‌కు ఇంగ్లీష్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. గోదావ‌రి పుష్క‌రాల స‌మ‌యంలో తొక్కిస‌లాట జ‌రిగి 30 మంది చ‌నిపోయిన ఘ‌ట‌న‌పై ప్ర‌ముఖ ఇంగ్లీష్ ఛాన‌ల్ టైమ్స్ నౌ చ‌ర్చ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు, విద్యాసంస్థ‌ల అథినేత‌లు అయిన ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి, మంత్రి నారాయ‌ణ చ‌ర్చ‌లో పాల్గొన్నారు. అయితే యాంక‌ర్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక కంగారుప‌డ్డారు. మంత్రులిద్ద‌రూ మాట్లాడిన ఇంగ్లీష్‌పై పెద్దెత్తున సెటైర్లు ప‌డ్డాయి.

ఆ దెబ్బ‌కు ఇక‌పై గ‌ల్లా జ‌య‌దేవ్ మిన‌హా ఎవ‌రూ ఇంగ్లీష్ ఛాన‌ళ్ల చ‌ర్చ‌ల్లో పాల్గొని ప‌రువు తీయ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. అయితే ప్ర‌త్యేక‌హోదాపై చ‌ర్చ సంద‌ర్భంగా టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ కూడా దాదాపు అదే త‌ర‌హా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఇంగ్లీష్‌లో నేరుగా మాట్లాడి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవ‌డం ఎందుక‌నుకున్నారో గానీ… తాను చెప్పాల్సిన దానిని ముందుగానే కాగితాల మీద రాసుకుని వ‌చ్చి చ‌ద‌వ‌డం మొద‌లుపెట్టారు. డిప్యూటీ చైర్మ‌న్ కురియ‌న్ అభ్యంత‌రం చెబుతున్నా సీఎం రమేష్ ప‌ట్టించుకోలేదు. దీంతో కురియ‌న్ కాస్త సీరియస్‌గానే స్పందించారు.

కాగితాల‌పై రాసుకుని వ‌చ్చి చ‌ద‌వ‌డంపై నిబంధ‌న గుర్తు చేశారు. పార్ల‌మెంట్‌లో ఇలా కాగితాల మీద రాసుకుని వ‌చ్చి చ‌ద‌వ‌డం నిబంధ‌న‌కు విరుద్ద‌మ‌ని చెప్పారు. ఏదైనా చెప్పాల‌నుకుంటే నేరుగా చెప్పాల‌ని ఆదేశించారు. దీంతో సీఎం ర‌మేష్ చాలా ఇబ్బంది ప‌డ్డారు. అయినా అంద‌రూ అన్ని భాష‌లు వ‌చ్చిన వారు ఉండ‌రు క‌దా!. సీఎం ర‌మేష్ కూడా ఇలా ఇంగ్లీష్ కోసం పాకులాడి స‌మ‌స్య‌లు తెచ్చుకునే బ‌దులు తెలుగులో మాట్లాడ‌వ‌చ్చు క‌దా !. ఎలాగో సభలో అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు అనువాద వ్యవస్థ ఉండనే ఉన్నది. గోదావరి పుష్కరాల సమయంలో టైమ్స్ నౌ నిర్వహించిన చర్చలో తొలుత మాట్లాడింది సీఎం రమేషే. ఇబ్బంది గమనించి ఆ తర్వాత విద్యాసంస్థల అధినేతలు పల్లె, నారాయణ రంగ ప్రవేశం చేశారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News