జగన్ మైలేజ్ అడ్డుకునేందుకే బాబు ఎత్తులు

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ, ఏపీ మధ్య నిప్పు రాజేస్తున్నది. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులతో తమ ప్రాంతం ఏడారి అవుతుందని ఆంధ్రప్రదేశ్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు తీరుకు నిరసనగా, తెలంగాణ కడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కర్నూలులో జగన్ మూడు రోజుల నిరాహార దీక్షకు కూడా సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ కేబినెట్ సోమవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై […]

Advertisement
Update: 2016-05-03 04:48 GMT

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ, ఏపీ మధ్య నిప్పు రాజేస్తున్నది. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులతో తమ ప్రాంతం ఏడారి అవుతుందని ఆంధ్రప్రదేశ్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు తీరుకు నిరసనగా, తెలంగాణ కడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కర్నూలులో జగన్ మూడు రోజుల నిరాహార దీక్షకు కూడా సిద్దమయ్యారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ కేబినెట్ సోమవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. జగన్ ఆందోళన చేస్తానని ప్రకటించగానే చంద్రబాబు కేబినెట్ లో తీర్మానం చేయించారని ఇదంతా ఒక డ్రామా అని కొట్టిపారేశారు. ఏపీలో జగన్ కు మైలేజ్ రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు ఈ ఎత్తులు వేశారని విమర్శించారు.

అక్రమ ప్రాజెక్టులను వైఎస్ కూడా నిర్మించారని చెప్పారు. కానీ పాలమూరు ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులు ఉన్నాయని తలసాని చెప్పారు. అసలు పట్టిసీమను చంద్రబాబు ఎవరి అనుమతులతో కట్టారో చెప్పాలని నిలదీశారు. ఎవరు అడ్డుపడినా తెలంగాణలో ప్రాజెక్టులు కట్టితీరుతామన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News