కారెం శివాజీ పదవికి ఎసరు ?

ఇటీవల ఏపీ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించబడ్డ మాలమహానాడు నాయకుడు కారెం శివాజీకి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణకు స్పీకరించిన కోర్టు  ఏపీ ప్రభుత్వంతో పాటు కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది.  క్రిమినల్ కేసులున్న వ్యక్తిని కమిషన్ చైర్మన్‌గా ఎలా నియమిస్తారంటూ సీనియర్ న్యాయవాది పీవీ ప్రసాద్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. కారెం శివాజీ నియామకంలో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు, పద్దతులు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా […]

Advertisement
Update:2016-04-26 11:24 IST

ఇటీవల ఏపీ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించబడ్డ మాలమహానాడు నాయకుడు కారెం శివాజీకి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణకు స్పీకరించిన కోర్టు ఏపీ ప్రభుత్వంతో పాటు కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ కేసులున్న వ్యక్తిని కమిషన్ చైర్మన్‌గా ఎలా నియమిస్తారంటూ సీనియర్ న్యాయవాది పీవీ ప్రసాద్ కుమార్ కోర్టును ఆశ్రయించారు.

కారెం శివాజీ నియామకంలో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు, పద్దతులు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నేరుగా చైర్మన్‌ను ప్రభుత్వం ఎలా నియమిస్తుందని పిటిషన్ ప్రశ్నించారు. కమిషన్ సభ్యులను కూడా ఎంపిక చేయలేదన్నారు. కమిషన్ చైర్మన్‌గా ఉండేందుకు అవసరమైన ఎలాంటి అర్హతలు కారెం శివాజీకి లేవని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.

దీంతో స్పందించిన కోర్టు శివాజీతోపాటు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కారెం శివాజీ నియామకానికి సంబంధించిన ఫైళ్లు అన్ని తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 7కు వాయిదా వేసింది. కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ మంగళవారం సాయంత్రం శివాజీ ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు రావాల్సి ఉన్నా కోర్టు నోటీసులు నేపథ్యంలో ఆయన ఆఖరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు. తాను డిప్లొమా చదివానని… కార్పొరేషన్ చైర్మన్ పదవికి డిగ్రీ ఉండాలన్న నిబంధన జీవోలో లేదని కారెం చెప్పారు. పిటిషన్ వేసిన వారి వెనుక జూపూడి ప్రభాకర్ ఉన్నారా అని ప్రశ్నించగా… జూపూడి, మందకృష్ణ తనకు మంచి స్నేహితులని కారెం శివాజీ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News