అగ్రిగోల్డ్‌ యాజమాన్యంపై చెప్పులు, రాళ్లతో దాడి

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో పొదుపు పేరుతో లక్షల మందిని మోసంచేసిన ఆగ్రిగోల్డ్‌ సంస్థ యాజమాన్యం కటకటాల వెనక్కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు నిందితులను బెంగుళూరులోని కర్ణాటక హైకోర్టుకు తీసుకువచ్చారు. అయితే కోర్టు ఆవరణలో ఆందోళనకు దిగిన బాదితులు ఒక్కసారిగా అగ్రిగోల్డ్‌ నిందితులపై రాళ్లు, చెప్పులతో దాడిచేశారు. ఈ దాడిలో అగ్రిగోల్డ్‌ సంస్థ చైర్మన్‌ అవ్వాసు వెంకటరామారావు, ఆయన సోదరుడు శేషునారాయణతో పాటు ముగ్గురు డైరెక్టర్లు స్వల్పంగా గాయపడ్డారు. ఇప్పటికే ఈ […]

Advertisement
Update:2016-04-11 17:00 IST

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో పొదుపు పేరుతో లక్షల మందిని మోసంచేసిన ఆగ్రిగోల్డ్‌ సంస్థ యాజమాన్యం కటకటాల వెనక్కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు నిందితులను బెంగుళూరులోని కర్ణాటక హైకోర్టుకు తీసుకువచ్చారు. అయితే కోర్టు ఆవరణలో ఆందోళనకు దిగిన బాదితులు ఒక్కసారిగా అగ్రిగోల్డ్‌ నిందితులపై రాళ్లు, చెప్పులతో దాడిచేశారు. ఈ దాడిలో అగ్రిగోల్డ్‌ సంస్థ చైర్మన్‌ అవ్వాసు వెంకటరామారావు, ఆయన సోదరుడు శేషునారాయణతో పాటు ముగ్గురు డైరెక్టర్లు స్వల్పంగా గాయపడ్డారు.
ఇప్పటికే ఈ కేసు హైదరాబాద్‌ హైకోర్టులో సమగ్రంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక సీఐడీ విచారణను నిలిపివేయాలంటూ కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది. అగ్రిగోల్డ్‌ నిందితులను కర్ణాటక హైకోర్టు నుంచి హైదరాబాద్‌ కోర్టుకు తరలించే సమయంలో బాధితులు ఒక్కసారిగా వారిపై చెప్పులు, రాళ్లతో విరుచుకుపడ్డారు. బాధితులు ఎక్కువ సంఖ్యలో రావడంతో పోలీసులు కట్టడి చేయలేకపోయారు. వెంటనే దాడి నుంచి తేరుకున్న పోలీసులు అగ్రిగోల్డ్‌ నిందితులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News