‘’రాస్కెల్, బఫెలో, ఆప్ట్రాల్ డీఎస్‌ఓ గాడివి’’
టీడీపీ నేత, ఏపీ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఎం. లింగారెడ్డి ఒక అధికారిని పబ్లిక్‌గా బూతులు తిట్టారు. నోటికి ఎంత వస్తే అంత అనేశారు. కడప జిల్లా పౌరసరఫరాల అధికారి జి. వెంకటేశ్వరరావుకి ఈ అవమానం ఎదురైంది. లింగారెడ్డికి ఖాళీ లేని సమయంలో ఫుడ్ అడ్వయిజరీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడమే డీఎస్‌ఓ చేసిన తప్పు. రెండేళ్లుగా జరగని ఎఫ్‌ఏసీ (ఫుడ్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాన్ని ఇన్‌ఛార్జి డీఎస్‌ఓగా జిల్లాకు వచ్చిన వెంకటేశ్వరరావు చొరవ తీసుకుని […]
టీడీపీ నేత, ఏపీ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఎం. లింగారెడ్డి ఒక అధికారిని పబ్లిక్‌గా బూతులు తిట్టారు. నోటికి ఎంత వస్తే అంత అనేశారు. కడప జిల్లా పౌరసరఫరాల అధికారి జి. వెంకటేశ్వరరావుకి ఈ అవమానం ఎదురైంది. లింగారెడ్డికి ఖాళీ లేని సమయంలో ఫుడ్ అడ్వయిజరీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడమే డీఎస్‌ఓ చేసిన తప్పు.
రెండేళ్లుగా జరగని ఎఫ్‌ఏసీ (ఫుడ్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాన్ని ఇన్‌ఛార్జి డీఎస్‌ఓగా జిల్లాకు వచ్చిన వెంకటేశ్వరరావు చొరవ తీసుకుని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన లింగారెడ్డి ఒక్కసారిగా ఊగిపోయారు. ‘‘ఈ రోజు చాలా వివాహాలు ఉన్నాయి. ఒక మాట ఫోన్ చేసి చెప్పి ఉంటే మరోరోజు సమావేశం ఏర్పాటు చేసుకునే వాళ్లం కదా ’’ అంటూ తిట్ల దండకం అందుకున్నారు. ‘‘రాస్కెల్.. బఫెలో.. ఇడియట్.. వెళ్లిపోరా ఇక్కడి నుంచి.. సమావేశం గురించి ఎందుకు చెప్పలేదు? నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా? ఏమనుకుంటున్నావ్.. ఆఫ్ట్రాల్ డీఎస్‌ఓ గాడివి’’ అంటూ డీఎస్‌ఓను ఇష్టమొచ్చినట్టు తిట్టారు. జిల్లా కలెక్టరేట్‌లోనే ఈ ఘటన జరిగింది. అంతమంది ముందు తనకు జరిగిన అవమానంపై డీఎస్‌వో కన్నీటిపర్యంతమయ్యారు.
డీఎస్‌వోను దూషించిన లింగారెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఆందోళన చేపడతామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బీఏ వేదనాయకం హెచ్చరించారు. సామూహిక సెలవుపై వెళ్తామని ప్రకటించారు.