మరో వారసురాలు వస్తోంది...

నిన్న‌టివ‌ర‌కు రాజ‌కీయాల్లోకి రాను రాను అన్న చిన్న కోడ‌లిని సైతం ఉత్త‌ర ప్ర‌దేశ్, స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్  రాజ‌కీయాల్లోకి లాగేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్-మే నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న చిన్న కోడ‌లు అపర్ణ, ల‌ఖ‌న‌న్ కంటోన్మెంట్ స్థానం నుండి పోటీచేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అప‌ర్ణాయాద‌వ్ (26)ములాయం సింగ్ రెండ‌వ కుమారుడు ప్ర‌తీక్ యాద‌వ్ భార్య‌. సొంత‌పార్టీతో రాజ‌కీయ వార‌స‌త్వం హ‌వాని కొన‌సాగిస్తున్న ములాయంసింగ్ యాద‌వ్ త‌న కుటుంబంలో ఏ ఒక్కరూ ప‌ద‌విలేకుండా […]

Advertisement
Update:2016-03-28 05:42 IST

నిన్న‌టివ‌ర‌కు రాజ‌కీయాల్లోకి రాను రాను అన్న చిన్న కోడ‌లిని సైతం ఉత్త‌ర ప్ర‌దేశ్, స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ రాజ‌కీయాల్లోకి లాగేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్-మే నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న చిన్న కోడ‌లు అపర్ణ, ల‌ఖ‌న‌న్ కంటోన్మెంట్ స్థానం నుండి పోటీచేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అప‌ర్ణాయాద‌వ్ (26)ములాయం సింగ్ రెండ‌వ కుమారుడు ప్ర‌తీక్ యాద‌వ్ భార్య‌. సొంత‌పార్టీతో రాజ‌కీయ వార‌స‌త్వం హ‌వాని కొన‌సాగిస్తున్న ములాయంసింగ్ యాద‌వ్ త‌న కుటుంబంలో ఏ ఒక్కరూ ప‌ద‌విలేకుండా ఉండ‌కూడ‌ద‌ని శ‌ప‌థం చేసిన‌ట్టే ఉన్నారు. తానుమూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశాక కొడుకు అఖిలేష్ యాద‌వ్‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిని చేశారు. తాను లోక్ స‌భ‌కు వెళ్లారు.

ఇక అఖిలేష్ భార్య డింపుల్ పార్ల‌మెంటు స‌భ్యురాలు. ములాయం ముగ్గురు మేన‌ల్లుళ్లు ఎంపిలుగా ఉన్నారు. ఇప్పుడు చిన్న‌కోడ‌లికి కూడా అధికారం క‌ట్టబెట్టే ప‌నిలో ఉన్నారు. అయితే అప‌ర్ణ‌కు ఆ కుటుంబంలో భిన్న‌మైన పేరుంది. ఆమె మోడీ అభిమానురాలు. ఆయ‌న‌తో సెల్ఫీ దిగి సోష‌ల్‌మీడియాలో పెట్టింది. త‌న‌కు సామాజిక సేవ అంటేనే మ‌క్కువ ఎక్కువ‌ని రాజ‌కీయాల్లోకి రాన‌ని చెబుతూ వ‌చ్చింది. త‌మ రాష్ట్రంలోని గ్రామాల్లో మ‌హిళా సాధికార‌త కోసం కృషి చేస్తోంది. మాంచెస్ట‌ర్ యూనివ‌ర్శిటీ నుండి పిజి ప‌ట్ట‌భ‌ద్రురాలు. మంచి గాయ‌ని కూడా. మొత్తానికి జీవితంలో త‌న‌దైన పంథాలో వెళుతున్న‌ట్టుగా నిన్న‌టివ‌ర‌కు క‌నిపించిన చిన్న‌కోడ‌లిని కూడా ములాయం త‌న బాట‌లోకి లాగేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News