ఇకపైనా ఎంతదూరమైనా పోరాడుతా...
తీర్పు తర్వాత రోజా తనపై అసెంబ్లీ విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం న్యాయానిదేనన్నారు. చివరకు న్యాయమే గెలిచిందన్నారు. దేశంలో ఎవరికి అన్యాయంజరిగినా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందన్న విషయంలో రుజువైందన్నారు. అండగా నిలిచిన తన నియోజవకర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపైనా ప్రజాసమస్యలపై గట్టిగానే పోరాడుతానని రోజా చెప్పారు. ప్రజల క ఓసం ఎంతదూరమైనా వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. ఆర్డర్ కాపీ రాగానే ఈరోజే అసెంబ్లీకి వెళ్తానని రోజాచెప్పారు. […]
తీర్పు తర్వాత రోజా తనపై అసెంబ్లీ విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం న్యాయానిదేనన్నారు. చివరకు న్యాయమే గెలిచిందన్నారు. దేశంలో ఎవరికి అన్యాయంజరిగినా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందన్న విషయంలో రుజువైందన్నారు. అండగా నిలిచిన తన నియోజవకర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపైనా ప్రజాసమస్యలపై గట్టిగానే పోరాడుతానని రోజా చెప్పారు. ప్రజల క ఓసం ఎంతదూరమైనా వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. ఆర్డర్ కాపీ రాగానే ఈరోజే అసెంబ్లీకి వెళ్తానని రోజాచెప్పారు. రోజా విషయంలో వచ్చిన తీర్పుతో రాజ్యంగం మరోసారి వర్దిల్లిందని ఆమె తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. రోజాకు హైకోర్టులో అనుకూల తీర్పు రావడంతో నగరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రోజాపై సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారపార్టీ, స్పీకర్ సభను హుందాగా నడపాలని హితవుపలికారు. రోజా అసెంబ్లీ వస్తుండడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒక మహిళ విషయంలో అసెంబ్లీ వ్యవహరించిన తీరు అన్యాయమని కోర్టులో మరోసారి రుజువైందని గిడ్డి ఈశ్వరి అన్నారు.
Click on Image to Read: