నెగ్గిన రోజా... ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

తనను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై కోర్టులో న్యాయపోరాటం చేస్తున్న రోజా విజయం సాధించారు. రోజాపై సస్పెన్షన్‌ను కొట్టి వేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నిన్న మూడు విడతలుగా వాదనలు విన్న కోర్టు నేడు తీర్పు వెలువరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రోజా అసెంబ్లీకి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్టే. నిబంధనలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా సస్పెన్షన్ వేసిన […]

Advertisement
Update:2016-03-17 05:19 IST

తనను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై కోర్టులో న్యాయపోరాటం చేస్తున్న రోజా విజయం సాధించారు. రోజాపై సస్పెన్షన్‌ను కొట్టి వేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నిన్న మూడు విడతలుగా వాదనలు విన్న కోర్టు నేడు తీర్పు వెలువరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రోజా అసెంబ్లీకి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్టే. నిబంధనలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా సస్పెన్షన్ వేసిన ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురుదెబ్బే.

తనను రూల్ 340(2) కింద ఏడాది సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొద్ది నెలల క్రితమే రోజా హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ పిటిషన్‌ విచారణలో తీవ్ర జాప్యం జరిగింది. లంచ్‌ మోషన్, హౌజ్‌ మోషన్‌ను దాఖలు చేసినా అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ విచారణ అర్హత లేదంటూ తిప్పిపంపారు. దీంతో రోజా సుప్రీంను ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు హైకోర్టులో పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు పిటిషన్‌ను తిరస్కరించే అధికారం అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు ఎక్కడిదని మండిపడింది.

హైకోర్టులో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది. మరుసటి రోజే పిటిషన్‌ను విచారించాలంటూ ఈ- మెయిల్ ద్వారా హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారం ఉదయమే హైకోర్టు రోజా పిటిషన్‌పై విచారణ జరిపారు. 340(2) కింద ఒక సభ్యురాలిని ఏడాదిపాటు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించింది. సదరు రూల్ కింద ఒక సభ్యుడిని ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. చివరకు రోజాపై సస్పెన్షన్‌ను కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News