అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టిన రోజా
రోజా వస్తే అడ్డుకునేందుకు మార్షల్స్ మోహరించడంతో మధ్యాహ్నం కాసేపు అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోజా వస్తే అడ్డుకుంటారని భావించారు. కానీ కోర్టు ఆర్డర్ కాపీతో వచ్చిన రోజా నేరుగా అసెంబ్లీ కార్యదర్శిని కలిసి దానిని అందజేశారు. అప్పటికే అసెంబ్లీ వాయిదా పడడంతో సమావేశానికి రోజా హాజరుకాలేకపోయారు. అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన రోజాకు వైసీపీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కార్యదర్శి కార్యాలయం వరకు ఆమె కలిసి వెళ్లారు. హైకోర్టు తీర్పు కాపీని చూసిన తర్వాత తుది నిర్ణయం […]
రోజా వస్తే అడ్డుకునేందుకు మార్షల్స్ మోహరించడంతో మధ్యాహ్నం కాసేపు అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోజా వస్తే అడ్డుకుంటారని భావించారు. కానీ కోర్టు ఆర్డర్ కాపీతో వచ్చిన రోజా నేరుగా అసెంబ్లీ కార్యదర్శిని కలిసి దానిని అందజేశారు. అప్పటికే అసెంబ్లీ వాయిదా పడడంతో సమావేశానికి రోజా హాజరుకాలేకపోయారు. అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన రోజాకు వైసీపీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కార్యదర్శి కార్యాలయం వరకు ఆమె కలిసి వెళ్లారు. హైకోర్టు తీర్పు కాపీని చూసిన తర్వాత తుది నిర్ణయం స్పీకర్ తీసుకుంటారని తెలుస్తోంది. రోజాను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకూడదని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌లో రివ్యూ పిటిషన్ వేసే యోచనలో ఉంది.
Click on Image to Read: