కొవ్వెక్కింది... అధ్యక్షా..!
ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు విచక్షణ కోల్పోయారు. ప్రతిపక్ష నేతను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు తీవ్రమైన పదాలను వాడి తరువాత నాలుక కరుచుకున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి చంద్రబాబు వివరణ ఇస్తూ గతంలో కోర్టు తీర్పు కాపీలను చాలాసేపు చదివి వినిపించారు. వైఎస్ హయాంలో తనపై ఎన్నోసార్లు కోర్టుకు వెళ్లారని, కానీ తాను నిజాయితీపరుడిగా బయటపడ్డానని, కోర్టుతీర్పులే అందుకు నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. […]
ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు విచక్షణ కోల్పోయారు. ప్రతిపక్ష నేతను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు తీవ్రమైన పదాలను వాడి తరువాత నాలుక కరుచుకున్నారు.
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి చంద్రబాబు వివరణ ఇస్తూ గతంలో కోర్టు తీర్పు కాపీలను చాలాసేపు చదివి వినిపించారు. వైఎస్ హయాంలో తనపై ఎన్నోసార్లు కోర్టుకు వెళ్లారని, కానీ తాను నిజాయితీపరుడిగా బయటపడ్డానని, కోర్టుతీర్పులే అందుకు నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు వివరణపై స్పందించిన జగన్… చంద్రబాబు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి కేసులనుంచి బయటపడ్డారని విమర్శించారు. దీంతో ఇదే అదునుగా జగన్ కోర్టులను కూడా కించపరుస్తున్నారంటూ అధికార పార్టీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని జగన్ అన్నారు. తాను కోర్టులను కించపరచలేదని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని మాత్రమే అన్నానని జగన్ చెప్పారు. చట్టసభల్లో కోర్టు తీర్పులపైన కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు వుంటుందని ఈ విషయం అధికారపక్ష సభ్యులు కూడా గుర్తుంచుకోవాలని అన్నారు. దీనికి స్పందించిన అచ్చెన్నాయుడు జగన్‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్ కోర్టులను కించపరుస్తూ పొరపాటుగా వ్యాఖ్యలు చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే ఈ కామెంట్స్ చేశారని ఆరోపించారు.
జగన్ “కొవ్వెక్కి మాట్లాడుతున్నారని” పదేపదే వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు . అచ్చెన్నాయుడు “కొవ్వెక్కిన ” వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వెంటనే అచ్చెన్నాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలు జగన్‌ని నొప్పించి వుంటే వెనక్కు తీసుకుంటానని అచ్చెన్నాయుడు చెప్పారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు శాంతించలేదు. దీంతో సభను పది నిమిషాలపాటు వాయిదావేయాల్సివచ్చింది. అచ్చెన్నాయుడే కాకుండా అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా అధికార పార్టీనేతలు పలుమార్లు ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.
Click on Image to Read: