విజయ్‌మాల్యని కేంద్రమే ఫ్లైట్ ఎక్కించిందా?
విజయ్ మాల్య ఎక్కడున్నాడు? ఆయన దేశం విడిచివెళ్లకుండా ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వరంగ బ్యాంకులు గగ్గోలు పెడుతున్నాయి. వేల కోట్ల అప్పులిచ్చి లబోదిబోమంటున్నాయి. అయితే ఇట్స్ టూ లేట్ అంటున్నాయి కొన్ని జాతీయ ఛానళ్లు! ఎందుకంటే విజయ్‌మాల్య ఎప్పుడో ఫ్లైట్ ఎక్కి విదేశాలకు చెక్కేశాడని చెబుతున్నాయి. జెనీవాలో విజయ్ మాల్య! వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విజయ్‌మాల్య ప్రస్తుతం జెనీవాలో ఉన్నట్టు తెలుస్తోంది. అనేక బ్యాంకులకు టోపీ పెట్టి.. ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో విలాసాల్లో మునిగితేలుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్ని అప్పుల్లో ఉన్నా […]
Advertisement
విజయ్ మాల్య ఎక్కడున్నాడు? ఆయన దేశం విడిచివెళ్లకుండా ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వరంగ బ్యాంకులు గగ్గోలు పెడుతున్నాయి. వేల కోట్ల అప్పులిచ్చి లబోదిబోమంటున్నాయి. అయితే ఇట్స్ టూ లేట్ అంటున్నాయి కొన్ని జాతీయ ఛానళ్లు! ఎందుకంటే విజయ్‌మాల్య ఎప్పుడో ఫ్లైట్ ఎక్కి విదేశాలకు చెక్కేశాడని చెబుతున్నాయి.
జెనీవాలో విజయ్ మాల్య!
వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విజయ్‌మాల్య ప్రస్తుతం జెనీవాలో ఉన్నట్టు తెలుస్తోంది. అనేక బ్యాంకులకు టోపీ పెట్టి..
ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో విలాసాల్లో మునిగితేలుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్ని అప్పుల్లో ఉన్నా విజయ్‌మాల్య లైఫ్‌స్టైల్ మాత్రం మారలేదు. అయినా ఇంతకాలం ప్రభుత్వరంగ బ్యాంకులు చోద్యం చూస్తుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది.
కేంద్రమే మాల్యకు సెండాఫ్ ఇచ్చిందా?
ఎంత దారుణమిది? ప్రభుత్వానికి తెలియకుండా విజయమాల్య లాంటి వేల కోట్ల డిఫాల్టర్ దేశం ఎలా దాటగలిగాడు? ఆయన జెనీవాలోనే
ఉన్నాడన్నవిషయం నిజమైతే అధికార వర్గాలు ఏం చేస్తున్నాయి? ఆయన విమానం ఎక్కిపోతుంటే టాటా చెబుతున్నాయా? అని విపక్షాలు ఆరోపిస్తోంది. దేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్‌గా మాల్య రుణాల ఎగవేతను అభివర్ణిస్తోంది.
బ్యాంకుల్లో మాల్య మనుషులు!?
విలాస పురుషుడు విమానమెక్కి విదేశాలకు వెళ్లిపోవడంలో బ్యాంకుల పాత్ర కూడా కాదనలేమని మార్కెట్ వర్గాలంటున్నాయి.
వేల కోట్ల ఎగవేతను చూస్తూ ఊరుకున్నాయంటే అనుమానించాల్సిందే అంటున్నాయి. అసలు మాల్యకు అప్పులు ఇచ్చిన ప్రతి బ్యాంకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఆయన మనుషులున్నారనీ., బ్యాంకులు తీసుకోబోయే ప్రతి చర్యనూ మాల్యకు ముందే చేరవేసేదని అంటున్నారు. మీడియాలో కూడా కొందరు విజయ్‌మాల్యకు కీలక విషయాలు లీక్ చేయడంతో ఆయన విదేశాలకు వెళ్లి తప్పించుకున్నారని వార్తలొస్తున్నాయి. ఏది ఏమైనా ఓ సామాన్యుడికి లక్ష రూపాయలు ఇవ్వడానికి సవాలక్ష షరతులు పెట్టే బ్యాంకులు..వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచిపోయినా చోద్యం చూస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement