బాలయ్యకు, రావెలకు తేడా లేదట!

సావిత్రి మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఎమ్మెల్యే , హీరో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  నెటిజన్లు బాలయ్యపై రగిలిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు బాలయ్య వ్యాఖ్యలపై ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సావిత్రి ఆడియో ఫంక్షన్‌కు హాజరైన బాలయ్య హద్దు దాటి మాట్లాడారు. తాను కూడా అన్ని పాత్రలు చేయలేనంటూ…’’ అమ్మాయిల వెంట పడితే ఊరుకుంటారా ఫ్యాన్స్… వెళ్లి ముద్దైనా పెట్టాలి లేకుంటే కడపుపైనా చేసేయాలి కమిట్ కమిట్ అయిపోవాలి’’ అంటూ వ్యాఖ్యానించి అందరినీ […]

Advertisement
Update:2016-03-06 04:37 IST

సావిత్రి మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఎమ్మెల్యే , హీరో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నెటిజన్లు బాలయ్యపై రగిలిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు బాలయ్య వ్యాఖ్యలపై ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సావిత్రి ఆడియో ఫంక్షన్‌కు హాజరైన బాలయ్య హద్దు దాటి మాట్లాడారు. తాను కూడా అన్ని పాత్రలు చేయలేనంటూ…’’ అమ్మాయిల వెంట పడితే ఊరుకుంటారా ఫ్యాన్స్… వెళ్లి ముద్దైనా పెట్టాలి లేకుంటే కడపుపైనా చేసేయాలి కమిట్ కమిట్ అయిపోవాలి’’ అంటూ వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతటితో ఆగలేదు. హీరోయిన్లపైనా డబుల్ మీనింగ్ డైలాగులు పేల్చారు. ‘‘మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు, పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు.. చూడని లోతుల్లేవు..’’ అని నారా రోహిత్‌కు హితబోధ చేశారు బాలయ్య.

బాలయ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలోకి ఎక్కడంతో రచ్చమొదలైంది. బాలయ్య ప్రజాప్రతినిధిగా ఉండేందుకు అనర్హుడని అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థి( పేరురాయడం లేదు) ఘాటుగా కామెంట్ పెట్టారు. బాలయ్య ఎమ్మెల్యే అయినందుకు సిగ్గుపడుతున్నామని కామెంట్ పెట్టారు. ”అయినవారికి ఆపదొస్తే అరగంట లేటుగా వస్తానేమో… ఆడదానికి ఆపద వస్తే మాత్రం…” అంటూ ఒక సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగుకు, ప్రస్తుతం బాలయ్య చేసిన కామెంట్స్‌ను కొందరు పోల్చి చూశారు. రీల్‌కు రియల్‌కు బాలయ్యలో ఇంత తేడా ఉందని పోలిక పెట్టారు. ‘ఇలాంటి వారిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు హిందూపురం ప్రజలు సిగ్గుపడాలి అని బెంగళూరుకు చెందిన ఒక గృహిణి కామెంట్ చేశారు..

”గిల్లడాలు, పొడవడాలు అంటూ వ్యాఖ్యలు చేసిన బాలయ్యకు, హైదరాబాద్‌లో మహిళ చేయి లాగిన మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడికి తేడా ఎక్కడుంది” అని విజయవాడకు చెందిన మహిళ( ఆమెకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో పేరు రాయడం లేదు) ప్రశ్నించారు. ”ఆడియో ఫంక్షన్ టీవీలో చూస్తుండగా బాలయ్య పచ్చి బూతులు మాట్లాడారు… ఛీ, చీ, ఛీ” అంటూ ఆమె కామెంట్ పెట్టారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News