ఆ రోజు నా కోసం వైఎస్‌ ఒక్కరే నిలబడ్డారు… ఆ ప్రేమతో ఫొటో పెట్టుకున్నా….

ముద్రగడ పద్మనాభం ఉద్యమం వెనుక  జగన్ హస్తముందని సీఎం చంద్రబాబు ఆరోపించడంపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు సవాల్ విసిరారు. తన వెనుక జగన్ ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి విరమించుకుంటానని చాలెంజ్ విసిరారు.  అధికారం ఉంది కాబట్టి నిరూపించాలని సవాల్ చేశారు. కాపుల హామీలను నేరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 11 నుంచి మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. తనకు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో ఎనలేని అనుబంధం ఉన్న మాట వాస్తవమేనన్నారు. ‘ఒకప్పుడు తాను తీవ్ర […]

Advertisement
Update:2016-03-04 05:20 IST

ముద్రగడ పద్మనాభం ఉద్యమం వెనుక జగన్ హస్తముందని సీఎం చంద్రబాబు ఆరోపించడంపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు సవాల్ విసిరారు. తన వెనుక జగన్ ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి విరమించుకుంటానని చాలెంజ్ విసిరారు. అధికారం ఉంది కాబట్టి నిరూపించాలని సవాల్ చేశారు. కాపుల హామీలను నేరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 11 నుంచి మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు.

తనకు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో ఎనలేని అనుబంధం ఉన్న మాట వాస్తవమేనన్నారు. ‘ఒకప్పుడు తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైఎస్‌ ఒక్కరే ముందుకొచ్చారని గుర్తు చేశారు. ‘’ముద్రగడ గారు నీ కష్టాల్లో నేను పాలుపంచుకుంటా… చెప్పండి అని వైఎస్‌ నాలుగైదు సార్లు ముందుకొచ్చారు’’ అని చెప్పారు. ఆ రోజు తన కోసం ఎవరూ రాలేదని వైఎస్ ఒక్కరే నిలబడ్డారని చెప్పారు. కానీ వైఎస్ దగ్గర సాయం తీసుకునేందుకు తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు.

కష్టాల్లో ఉనప్పుడు ఒక్క రాజశేఖర్‌ రెడ్డి తప్ప మరే నేత తన కోసం రాలేదని… అందుకే వైఎస్‌ అంటే తనకు ఎంతో ప్రేమ అన్నారు. ఆ ప్రేమతోనే తన ఇంటిలో వైఎస్‌ ఫోటో పెట్టుకున్నానని చెప్పారు. ఇప్పటికీ వైఎస్‌పై ప్రేమ నా గుండెల్లో నిలిచిపోయిందన్నారు. వైఎస్‌ మాటలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు.

Click on image to read:


Tags:    
Advertisement

Similar News