మ‌న‌సు గాయ‌ప‌డితే...శ‌రీరంలో నొప్పులు!

తీవ్ర‌మైన మెడ‌నొప్పి, వెన్నునొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నవారు ట్రీట్‌మెంట్‌తో పాటు  త‌మ మాన‌సిక స్థితి ఎలా ఉంది అనే విష‌యాన్ని కూడా గ‌మ‌నించాల్సి ఉంటుంది. ఎందుకంటే మాన‌సిక‌వేద‌న‌, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ లాంటివి భ‌రిస్తున్న‌వారిలో నొప్పులు మ‌రింత తీవ్రంగా ఉంటాయ‌ని ఒక కెన‌డా అద్య‌య‌నంలో తేలింది. డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న వారిలో 75శాతం మందిలో నొప్పులు మ‌ళ్లీ మ‌ళ్లీ తిర‌గ‌బెట్టడం లేదా నొప్పి తీవ్రంగా ఉండ‌టం గ‌మ‌నించారు. డిప్రెష‌న్లో ఉన్న‌వారికి తీవ్ర‌మైన మెడ‌, న‌డుము నొప్పులు, డిప్రెష‌న్ లేనివారికంటే నాలుగురెట్లు ఎక్కువ‌గా వ‌చ్చే […]

Advertisement
Update:2016-03-01 06:09 IST

తీవ్ర‌మైన మెడ‌నొప్పి, వెన్నునొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నవారు ట్రీట్‌మెంట్‌తో పాటు త‌మ మాన‌సిక స్థితి ఎలా ఉంది అనే విష‌యాన్ని కూడా గ‌మ‌నించాల్సి ఉంటుంది. ఎందుకంటే మాన‌సిక‌వేద‌న‌, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ లాంటివి భ‌రిస్తున్న‌వారిలో నొప్పులు మ‌రింత తీవ్రంగా ఉంటాయ‌ని ఒక కెన‌డా అద్య‌య‌నంలో తేలింది. డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న వారిలో 75శాతం మందిలో నొప్పులు మ‌ళ్లీ మ‌ళ్లీ తిర‌గ‌బెట్టడం లేదా నొప్పి తీవ్రంగా ఉండ‌టం గ‌మ‌నించారు. డిప్రెష‌న్లో ఉన్న‌వారికి తీవ్ర‌మైన మెడ‌, న‌డుము నొప్పులు, డిప్రెష‌న్ లేనివారికంటే నాలుగురెట్లు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందుకే మాన‌సికంగా ఆరోగ్యంగా లేనివారు శారీర‌క బాధ‌ల ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు.

మెడ‌, న‌డుము నొప్పుల‌తో పాటు క‌డుపు, త‌ల నొప్పులు కూడా వీరిని బాధిస్తుంటాయి. డిప్రెష‌న్లో ఉన్న‌పుడు మెద‌డు ఎక్కువ‌గా భావోద్వేగాల‌కు గురికావ‌డం, భ‌రించే శ‌క్తిని పూర్తిగా కోల్పోవ‌డం వ‌ల‌న నొప్పులు అధిక‌మ‌వుతాయ‌ని జ‌న‌ర‌ల్ సైకియాట్రి అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

మ‌నిషి డిప్రెష‌న్‌లో ఉన్న‌ప్పుడు మెద‌డులో ఉత్ప‌త్తి అయ్యే ర‌సాయ‌నాలు ఓపియాడ్స్ మ‌రింత‌గా పెరుగుతాయి. ఇవి శ‌రీరంమీద వ్య‌తిరేక ప్రభావాన్ని చూపుతాయి. ఒక్కోసారి ఇవి రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపి రోగాల‌కు కార‌ణ‌మవుతాయి. కొన్నిసార్లు ఇవి ఇన్‌ప్ల‌మేట‌రీ ప్రొటీన్ ఐఎల్ 18 విడుద‌ల‌కు కార‌ణ‌మవుతాయి. ఈ ప్రొటీన్ గుండెవ్యాధుల‌ను క‌లిగిస్తుంది

మ‌నం మామూలుగా గ‌మ‌నించినా ఈ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. ప్ర‌తిదానికీ బాధ‌ప‌డేవారు, ఏడ్చేవారు, కుమిలిపోయేవారు…ఇలాంటి వారిలో బాధ‌ల‌ను త‌ట్టుకునే గుణం, నొప్పుల‌ను భ‌రించే శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. తాము దేనికీ త‌ట్టుకోలేమ‌నే నిశ్చ‌యానికి వారు వ‌చ్చేసి ఉంటారు. వీరిలో మానసిక బ‌లం పెరిగితేనే శారీర‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే శారీర‌క వ్యాయామాల‌తో డిప్రెష‌న్‌పై పోరాటం చేసి మాన‌సిక బ‌లాన్ని పెంచుకోవ‌చ్చు. ఇవి రెండూ ఒక‌దానిపై ఒకటి ఆధార‌ప‌డి ఉన్న‌వ‌ని గుర్తించాలి.

Tags:    
Advertisement

Similar News