కేసీఆర్ మ‌నుమ‌డు....ది హీరో!

రెండుత‌రాలు క్రియాశీల‌క రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌గా మూడోత‌రం న‌ట‌న‌తో తెర‌మీద క‌నిపించ‌బోతోంది. తెలంగాణ రాష్ట్ర‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌నుమ‌డు, మంత్రి కెటిఆర్ కుమారుడు అయిన హిమాన్షు హీరోగా తెర‌మీద మెర‌వ‌నున్నాడు. మొట్ట‌మొద‌టి చిత్రంతోనే అత‌ను సూప‌ర్‌హీరో అనిపించుకోబోతున్నాడు. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్మిస్తున్న‌‘సూపర్ హార్ట్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు బాల‌ క‌థానాయుడిగా అల‌రించ‌నున్నాడు. భిన్న సామాజిక స‌మ‌స్య‌ల‌ను ఈ షార్ట్‌ఫిల్మ్‌లో తెర‌కెక్కిస్తున్నారు. హిమాన్షుతో పాటు వివిధ‌ దేశాల‌కు  చెందిన ఆరుగురు సూప‌ర్ హీరోలు […]

Advertisement
Update:2016-02-29 04:37 IST

రెండుత‌రాలు క్రియాశీల‌క రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌గా మూడోత‌రం న‌ట‌న‌తో తెర‌మీద క‌నిపించ‌బోతోంది. తెలంగాణ రాష్ట్ర‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌నుమ‌డు, మంత్రి కెటిఆర్ కుమారుడు అయిన హిమాన్షు హీరోగా తెర‌మీద మెర‌వ‌నున్నాడు. మొట్ట‌మొద‌టి చిత్రంతోనే అత‌ను సూప‌ర్‌హీరో అనిపించుకోబోతున్నాడు. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్మిస్తున్న‌‘సూపర్ హార్ట్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు బాల‌ క‌థానాయుడిగా అల‌రించ‌నున్నాడు. భిన్న సామాజిక స‌మ‌స్య‌ల‌ను ఈ షార్ట్‌ఫిల్మ్‌లో తెర‌కెక్కిస్తున్నారు. హిమాన్షుతో పాటు వివిధ‌ దేశాల‌కు చెందిన ఆరుగురు సూప‌ర్ హీరోలు ఇందులో ఉంటారు. వీరికి వ్య‌తిరేకంగా విల‌న్ పాత్ర‌లో ఏషియ‌న్, స్ట్రాంగ్ మ్యాన్‌గా పేరున్న మనోజ్ చోప్రా న‌టిస్తున్నాడు.

ఆరునుండి ప‌దినిముషాల నిడివితో తెర‌కెక్కించ‌బోతున్న ఈ ల‌ఘు చిత్రంలో సామాజిక స‌మ‌స్య‌లే ఇతివృత్తంగా ఉంటాయి. బాల‌కార్మిక వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌, డ్ర‌గ్స్‌, అవినీతి, పిల్లల అక్ర‌మ‌ర‌వాణా…ఇలా స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తున్న అంశాల‌పై క‌థ‌నాలు ఈ సందేశాత్మ‌క చిత్రంలో ఉంటాయి. ఈ నెల 28న ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఈ షార్ట్‌ఫిల్మ్‌ని లాంఛ‌నంగా ప్రారంభించారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారితోపాటు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, మనోజ్ చోప్రా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా, స్వ‌ల్ప అనారోగ్యం కార‌ణంగా హిమాన్షు హాజ‌రు కాలేక‌పోయాడు. చిత్రం షూటింగ్‌ని మార్చి 22నుండి ప్రారంభిస్తున్నారు. హిమాన్షు ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో కుటుంబంతో పాటు క‌న‌బ‌డుతూ ప్ర‌జ‌ల‌ను, మీడియాను ఆక‌ట్టుకుంటున్నాడు. గ‌త ఏడాది గ‌ణేశ నిమ‌జ్జ‌నం రోజున ఒంట‌రిగా ఖైర‌తాబాద్ వినాయ‌కుని ద‌ర్శించుకున్న హిమాన్షు మీడియా ప్ర‌తినిధులు ఆశ్చ‌ర్యపోయేలా త‌న మ‌న‌సులోని భావాలు వెల్ల‌డించ‌గ‌లిగాడు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News