2686 పోస్టులతో ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్
సుమారు 150 పోస్టులతో గ్రూప్-1, 905 పోస్టులతో గ్రూప్-2
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. మొత్తం 2686 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, ఎప్పుడు పరీక్షలు నిర్వహించనున్నదో అందులో పేర్కొన్నది. గ్రూప్-1లో సుమారు 150, గ్రూప్-2లో 905, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు 290, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 435 పోస్టులు, డిప్యూటీ డీఈవోలు 38, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు 290 ఇందులో ప్రధానంగా ఉన్నాయి.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షలను 2025 మార్చి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్‌లో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత కేటగిరిల వారీగా పోస్టులను ప్రకటించనున్నది. డీఎస్సీ పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నది. పైన ఇవ్వబడిన పరీక్షల తేదీలు పరిస్థితులను బట్టి మారుతాయని చెప్పింది.
ఏపీపీఎస్సీ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన డ్రాఫ్ట్ కోసం క్లియ్ చేయండి