ఈ పాపం ఎవ్వరిది?

పవన్‌ కల్యాణ్.  2014 ఎన్నికల్లో టీడీపీకి ఓటేయమని కోరినందుకు ఇప్పుడు చేయని పాపానికి ఫలితం అనుభవిస్తున్నారు.  చంద్రబాబు చేసే తప్పుల్లో సగ పాపం పవన్‌ మోయాల్సి వస్తోంది.  “ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా.. జనానికి చెడు జరిగితే ఎవరినైనా ప్రశ్నిస్తా” అన్న పవన్ ఇప్పటి వరకు చంద్రబాబును మాత్రం ప్రశ్నించింది లేదు.  తాజాగా ఫార్టీ పిరాయింపులతో ఎలాంటి సంబంధం లేకపోయినా చంద్రబాబు చేస్తున్న  పాపంలో పవన్‌ వాటా పంచుకుంటున్నారు. అదేలాగంటే… బాబును గుడ్డిగా ఫాలో అయిపోయి సమర్థిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్… […]

Advertisement
Update:2016-02-28 06:05 IST

పవన్‌ కల్యాణ్. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఓటేయమని కోరినందుకు ఇప్పుడు చేయని పాపానికి ఫలితం అనుభవిస్తున్నారు. చంద్రబాబు చేసే తప్పుల్లో సగ పాపం పవన్‌ మోయాల్సి వస్తోంది. “ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా.. జనానికి చెడు జరిగితే ఎవరినైనా ప్రశ్నిస్తా” అన్న పవన్ ఇప్పటి వరకు చంద్రబాబును మాత్రం ప్రశ్నించింది లేదు. తాజాగా ఫార్టీ పిరాయింపులతో ఎలాంటి సంబంధం లేకపోయినా చంద్రబాబు చేస్తున్న పాపంలో పవన్‌ వాటా పంచుకుంటున్నారు. అదేలాగంటే…

బాబును గుడ్డిగా ఫాలో అయిపోయి సమర్థిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్… ఆ మధ్య తలసాని విషయంలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. టీడీపీ తరపున గెలిచిన తలసాని టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అవడం ఏమిటని బాబు తరపున ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పార్టీ మారావు సరే సనత్ నగర్‌ ప్రజల నమ్మకాన్ని తెచ్చుకోగలవా అని తలసానిని టీడీపీ తరపున పవన్ సూటిగా ప్రశ్నించారు. పవన్ అలా ప్రశ్నించడంలో తప్పులేదు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడం తప్పే. మరి ఇప్పుడు పవన్‌ కు ఇష్టమైన చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తీసుకుంటున్నారు. మరి ఇక్కడ పవన్ ప్రశ్నించకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ కొన్ని మీడియా సంస్థలు పవన్‌ను ప్రశ్నిస్తున్నాయి..

తెలంగాణలో ఫిరాయింపులను తప్పుపట్టిన పవన్‌ సొంత రాష్ట్రం ఏపీలో అదే రాజకీయం నడుస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నాయి. నిజంగా పవన్ నిజాయితీపరుడైతే అయిష్టంగానైనా ప్రెస్ మీట్ పెట్టి బాబు చర్యను ఖండించాల్సింది. కానీ అది జరగలేదు… జరిగే సూచనలు కూడా కనిపించడం లేదు. ఆయన ట్విట్టర్ అకౌంట్లోనూ అప్ డేట్ లేదు. ఈ ఒక్క విషయంలోనే కాదు చంద్రబాబు పాలనను తిట్టాల్సి వచ్చిన ప్రతీసారి పవన్‌ను కూడా జనం తిడుతున్నారు. ఈ పవన్ ప్రచారం వల్లే కదా టీడీపీకి అదనంగా ఓట్లు పడి ఈరోజు చంద్రబాబు మా నెత్తిన కూర్చుకున్నారని మండిపడుతున్నారు. పరోక్షంగా చంద్రబాబు పాపపుణ్యాల్లో పవన్ కూడా వాటా తీసుకుంటున్నట్టుగా ఉంది. చంద్రబాబు చర్యలను తప్పుపట్టకుండా తప్పించుకు తిరిగినన్ని రోజులూ పవన్ ఈ పాపం మోయాల్సిందే. అందుకే సొంత ఆలోచన లేకుండా గుడ్డిగా మరొకరిని ఫాలో అయితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అందుకే “ట్రెండ్ సెట్ చేస్తే బాగానే ఉంటుంది కానీ మరొకరి ట్రెండ్ ను ఫాలో అయితే” ఇలానే ఉంటుంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News