ఓ ఐటీ పితామ‌హా... ఆ బూతులు స‌రిచేయించండి!

చంద్రబాబు. దేశంలో సాంకేతిక విప్ల‌వానికి నాందిప‌లికింది తానేన‌ని చెప్పుకుంటుంటారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా ఐటీ ప‌రిజ్ఞానంతో ట‌క్కున త‌న‌కు తెలిసిపోతుంద‌ని చెబుతుంటారు. ఐటీని వాడుకోవ‌డంలో త‌మ‌కు తామే సాటి అని టీడీపీ భావ‌న. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అధికార వెబ్ సైట్ సంగ‌తి చూస్తే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవ‌డం ఖాయం. వైబ్ సైట్ నిర్వాహ‌కుల‌కు క‌నీస ప‌రిజ్ఞానం కూడా లేద‌న్న‌ది ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ఎమ్మెల్యేలు ఎవ‌రు? కేంద్ర‌మంత్రులు ఎవ‌రు? కూడా తెలియ‌ని అమాయ‌కుల చేతిలో వెబ్ […]

Advertisement
Update:2016-02-25 04:08 IST

చంద్రబాబు. దేశంలో సాంకేతిక విప్ల‌వానికి నాందిప‌లికింది తానేన‌ని చెప్పుకుంటుంటారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా ఐటీ ప‌రిజ్ఞానంతో ట‌క్కున త‌న‌కు తెలిసిపోతుంద‌ని చెబుతుంటారు. ఐటీని వాడుకోవ‌డంలో త‌మ‌కు తామే సాటి అని టీడీపీ భావ‌న. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అధికార వెబ్ సైట్ సంగ‌తి చూస్తే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవ‌డం ఖాయం. వైబ్ సైట్ నిర్వాహ‌కుల‌కు క‌నీస ప‌రిజ్ఞానం కూడా లేద‌న్న‌ది ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ఎమ్మెల్యేలు ఎవ‌రు? కేంద్ర‌మంత్రులు ఎవ‌రు? కూడా తెలియ‌ని అమాయ‌కుల చేతిలో వెబ్ సైట్ న‌డుస్తోంది. http://www.ap.gov.in/government/mla/ వెబ్‌సైట్లో ఎమ్మెల్యేల వివ‌రాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే షాక్ మీద షాక్ తగలడం ఖాయం.

మాజీ కేంద్ర‌మంత్రుల‌ను ఎమ్మెల్యేలుగా చూపించారు. చ‌నిపోయిన వారిని బ‌తికించారు. ఓడిన వారిని గెలిచిన‌ట్టు చూపించారు. గెలిచిన వారిని ఓడించారు. ఉదాహ‌ర‌ణ‌కు…ఖైర‌తాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామ‌చంద్రారెడ్డిని చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యేగా చూపించారు. ఆయ‌న ఫోటో కూడా పెట్టేశారు. చిత్తూరు జిల్లా పుంగ‌నూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి విజ‌యం సాధించ‌గా… ఆయ‌న పేరు క‌రెక్ట్‌గానే పెట్టారు. కానీ ఫొటో మాత్రం రాయ‌దుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డిది ఉంచారు.

కామెడీ ఆఫ్ ది ఇయర్ ఏంటంటే… గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నారాయణస్వామి స్థానంలో కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ఫొటో పెట్టేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బదులు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫోటో పెట్టారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలా విన్యాసాలు ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్ సైట్లో చాలా కనిపిస్తున్నాయి.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News