స్పోర్ట్స్ స్టేడియం...కోర్టు హాలయిపోయింది!
దేశంలోనే ఒక హత్యకేసులో అత్యంత ఎక్కువమంది నిందితులు ఉన్న కేసు కోసం, క్రీడా ప్రాంగణాన్ని కోర్టు హాలుగా మార్చేశారు. అటవీశాఖ అధికారులు శ్రీధర్, డేవిడ్ కరుణాకర్ల హత్య కేసు విషయంలో ఇలాంటి మార్పు చేయాల్సి వచ్చింది. వీరు రెండేళ్ల క్రితం శేషాచలం అడవుల్లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో మొత్తం 435మందిని నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. అందులో 351మందిని అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచారు. వీరిలో నలుగురు మరణించారు. 61మంది బెయిల్‌మీద బయట ఉన్నారు. మరణించినవారు […]
దేశంలోనే ఒక హత్యకేసులో అత్యంత ఎక్కువమంది నిందితులు ఉన్న కేసు కోసం, క్రీడా ప్రాంగణాన్ని కోర్టు హాలుగా మార్చేశారు. అటవీశాఖ అధికారులు శ్రీధర్, డేవిడ్ కరుణాకర్ల హత్య కేసు విషయంలో ఇలాంటి మార్పు చేయాల్సి వచ్చింది. వీరు రెండేళ్ల క్రితం శేషాచలం అడవుల్లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో మొత్తం 435మందిని నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. అందులో 351మందిని అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచారు. వీరిలో నలుగురు మరణించారు. 61మంది బెయిల్‌మీద బయట ఉన్నారు. మరణించినవారు పోను ప్రస్తుతం 347మందిని కోర్టుముందు హాజరుపరచాల్సి వచ్చింది. దాంతో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంని న్యాయవేదికగా మార్చారు.
రేణిగుంట పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఈ కేసుకి సంబంధించి ఒకేసారి నిందితులు అందరినీ, మొత్తం 347 మందినీ బుధవారం (ఈరోజు) హాజరుపరుస్తున్నారు. జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి పి.వి. రాంబాబు ఈ కేసు విచారణ చేస్తున్నారు. ఒక హత్యకేసులో అత్యంత ఎక్కువమంది నిందితులుగా ఉన్న కేసుల్లో, దేశంలోనే ఇది మొదటిది కావడం విశేషం. తిరుపతి పోలీసులు ఈ కోర్టు నిర్వహణ కోసం భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.