ఆ ఆరుగురిని కని సీమ తల్లి బక్కచిక్కింది
చంద్రబాబు ఫోకస్ మొత్తం కోస్తాపై మరీముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై పెట్టడంతో కొద్దికాలంగా సీమలో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీమవాసుల్లో భరోసా నింపేందుకు వామపక్షాలు బస్ యాత్ర మొదలుపెట్టాయి. ఈ యాత్రలో పాల్గొన్న సీపీఐ నారాయణ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తునిలో రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలేనని చంద్రబాబు అనడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే చంద్రబాబు ఈ ప్రాంతాన్ని రౌడీలు నివసించే ప్రాంతంగా చిత్రీకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాయలసీమను చంద్రబాబు పదేపదే అవమానిస్తున్నారని విమర్శించారు. […]
చంద్రబాబు ఫోకస్ మొత్తం కోస్తాపై మరీముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై పెట్టడంతో కొద్దికాలంగా సీమలో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీమవాసుల్లో భరోసా నింపేందుకు వామపక్షాలు బస్ యాత్ర మొదలుపెట్టాయి. ఈ యాత్రలో పాల్గొన్న సీపీఐ నారాయణ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తునిలో రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలేనని చంద్రబాబు అనడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే చంద్రబాబు ఈ ప్రాంతాన్ని రౌడీలు నివసించే ప్రాంతంగా చిత్రీకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాయలసీమను చంద్రబాబు పదేపదే అవమానిస్తున్నారని విమర్శించారు. పది మందిని కన్న అమ్మ బక్కచిక్కినట్టుగా.. రాయలసీమ తల్లి ఆరుగురు ముఖ్యమంత్రులను కని బక్కచిక్కిపోయింది. ప్రభుత్వం రాయలసీమ పట్ల పూర్తిగా వివక్ష చూపుతోందని నారాయణ ఆరోపించారు. సీమ ప్రజలు భయంకరమైన కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Click on image to read: