మిస్టర్ రెడ్డి సారీ..
కర్నూలు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ దిగివచ్చేలా చేయగలిగారు. అనంతపురం జిల్లాలో జరిగిన రాహుల్ సభలో ఎదురైన అవమానంపై హైకమాండ్ చేత క్షమాపణ చెప్పించుకోగలిగారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్… స్వయంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని కలిసి క్షమాపణ చెప్పారు. రాహుల్ సభలో జరిగిన దానికి చింతిస్తున్నామని తప్పుగా భావించవద్దని దిగ్విజయ్ కోరారు. కొద్దిరోజుల క్రితం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి 10ఏళ్లు […]
కర్నూలు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ దిగివచ్చేలా చేయగలిగారు. అనంతపురం జిల్లాలో జరిగిన రాహుల్ సభలో ఎదురైన అవమానంపై హైకమాండ్ చేత క్షమాపణ చెప్పించుకోగలిగారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్… స్వయంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని కలిసి క్షమాపణ చెప్పారు. రాహుల్ సభలో జరిగిన దానికి చింతిస్తున్నామని తప్పుగా భావించవద్దని దిగ్విజయ్ కోరారు.
కొద్దిరోజుల క్రితం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి 10ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో రాహుల్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కోట్ల కూడా వెళ్లారు. అయితే సభ వేదిక వద్దకు సూర్యప్రకాశ్ రెడ్డిని అనుమతించలేదు. దీంతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారు. అవమాన భారంతో వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. కోట్లకు జరిగిన అవమానంతో రగిలిపోయిన అనుచరులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. హైకమాండ్ దిగివచ్చి సారీ చెప్పేవరకు తాళం తెరిచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్ర స్థాయి నాయకులు ఎంతమంది బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కొద్దిరోజుల క్రితం హైకమాండ్ దూతగా తిరునావక్కరసు వచ్చి చర్చలు జరిపారు. ఇప్పుడు ఏకంగా దిగ్విజయ్ సింగ్ కలిసి నేరుగా క్షమాపణ చెప్పారు. మొత్తం మీద కోట్ల దెబ్బకు హైకమాండ్ దిగివచ్చినట్టే అయింది. దిగి రాక చస్తుందా… పార్టీ నమ్ముకుని ఉన్న కొద్ది మందిని కూడా దూరం చేసుకుంటే అనవాళ్లు కూడా మిగలవు కదా!
Click on Image to Read: