తెలివిగా త‌న‌యుడిని త‌ప్పించిన బాబు!

”సెంట్ అయితే సొంత చొక్కా మీద చ‌ల్లుకో… బుర‌దైతే ప‌క్కోడి చొక్కా మీదకు వేసేయ్” అన్న‌ట్టుగా ఉంది చంద్ర‌బాబు రాజకీయం. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారం చేప‌ట్ట‌డం, తెలంగాణ‌లోనూ 15 స్థానాలు రావ‌డంతో బాబులో కొత్త ఆశ‌లు చిగురించాయి. 2019 నాటికి తెలంగాణ‌లోనూ అధికారంలోకి వ‌స్తామ‌ని మ‌హానాడు వేదిక‌గా అధినేత నుంచి లోక‌ల్ లీడ‌ర్ వ‌ర‌కూ గ‌ర్జించారు. మ‌రి తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే ముఖ్య‌మంత్రి ఎవ‌రు కావాలి!. బాబు తెలివైన వారు కదా!. అప్పుడే లోకేష్‌ను తెర‌పైకి […]

Advertisement
Update:2016-02-18 05:55 IST

”సెంట్ అయితే సొంత చొక్కా మీద చ‌ల్లుకో… బుర‌దైతే ప‌క్కోడి చొక్కా మీదకు వేసేయ్” అన్న‌ట్టుగా ఉంది చంద్ర‌బాబు రాజకీయం. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారం చేప‌ట్ట‌డం, తెలంగాణ‌లోనూ 15 స్థానాలు రావ‌డంతో బాబులో కొత్త ఆశ‌లు చిగురించాయి. 2019 నాటికి తెలంగాణ‌లోనూ అధికారంలోకి వ‌స్తామ‌ని మ‌హానాడు వేదిక‌గా అధినేత నుంచి లోక‌ల్ లీడ‌ర్ వ‌ర‌కూ గ‌ర్జించారు. మ‌రి తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే ముఖ్య‌మంత్రి ఎవ‌రు కావాలి!. బాబు తెలివైన వారు కదా!. అప్పుడే లోకేష్‌ను తెర‌పైకి తెచ్చారు. ఏపీని బాబు చూసుకుంటారు…. టీటీడీపీని చిన‌బాబు న‌డిపిస్తార‌ని చెప్పారు.

అన్న‌ట్టుగానే లోకేష్ క‌నుస‌న్న‌ల్లోనే తెలంగాణ టీడీపీ వ్య‌వ‌హారాలు న‌డిచాయి. గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కేటీఆర్‌కు పోటీగా లోకేష్ బాబు రంగంలోకి దిగారు. సెటిల‌ర్ ఓట్ల‌ను న‌మ్ముకుని విస్రృతంగా ప్ర‌చారం చేశారు. అయితే సెటిల‌ర్లు కూడా ఓటేయ‌లేదు. టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఫ‌లితం లోకేష్ పొలిటికల్ స్టామినాపైనా అనుమానాలు రేపింది. టీటీడీపీ ఎమ్మెల్యేలు కూడా వ‌రుస పెట్టి కారెక్కేశారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు తెలివిగా పావులు క‌దిపారు.

తెలంగాణ రాజ‌కీయాల‌కు త‌న‌యుడు లోకేష్‌ను లింక్ చేస్తే యువ‌నాయ‌కుడి భ‌విష్య‌త్తుకు తీవ్ర ఇబ్బంది త‌ప్ప‌ద‌న్న భావ‌న‌కు చంద్ర‌బాబు వ‌చ్చిన‌ట్టుగా ఉంది. బుధ‌వారం విజ‌య‌వాడ‌లో టీటీడీపీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించిన చంద్ర‌బాబు… ఇక‌పై టీటీడీపీ నేత‌లు రేవంత్ రెడ్డి, ఎల్ ర‌మ‌ణ సార‌థ్యంలో ప‌నిచేయాల‌ని మిగిలిని నాయకులకు సూచించారు. వారిద్ద‌రిని ముందుపెట్టుకుని ప‌ని చేయాల‌ని బాబు ఆదేశించారు. అయితే ఎక్క‌డా కూడా లోకేష్ నాయ‌క‌త్వ ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు.

తెలివిగానే తెలంగాణ పార్టీని రేవంత్, ర‌మ‌ణ‌కు అప్ప‌గించి లోకేష్‌ను త‌ప్పించార‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు. ఇప్ప‌టికే గ్రేట‌ర్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ను లోకేష్‌కు అప్ప‌గించ‌డం వ‌ల్ల త‌న‌యుడి రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు న‌ష్టం జ‌రిగింద‌న్న భావ‌న‌లో బాబు ఉన్నార‌ట‌. కాబ‌ట్టి తెలంగాణ పాలిటిక్స్‌కు లోకేష్‌ను అనుసంధానం చేస్తే మ‌రింత న‌ష్టం త‌ప్ప‌ద‌నే చంద్ర‌బాబు ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు. అంటే ఇక‌పై తెలంగాణ టీడీపీలో పాప‌పుణ్యాల‌కు, న‌ష్టాల‌కు రేవంత్, ఎల్ ర‌మ‌ణే బాధ్యుల‌వుతార‌న్న మాట‌.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News