కాపులను తోడేళ్లతో పోల్చిన టీడీపీ ఎమ్మెల్యే

టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్య కాపు రిజర్వేషన్లపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీల పట్ల ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వివక్ష చూపుతోందని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చకూడదంటూ బీసీలు దీక్షలు చేస్తుంటే బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అదే కాపు నేతలు దీక్షలు చేస్తే రాయబారానికి మంత్రులను పంపి… నజరానాలు ప్రకటించారని కృష్ణయ్య మండిపడ్డారు. ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేర్చడం అంటే గొర్రెల మందలోకి […]

Advertisement
Update:2016-02-16 07:03 IST

టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్య కాపు రిజర్వేషన్లపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీల పట్ల ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వివక్ష చూపుతోందని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చకూడదంటూ బీసీలు దీక్షలు చేస్తుంటే బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అదే కాపు నేతలు దీక్షలు చేస్తే రాయబారానికి మంత్రులను పంపి… నజరానాలు ప్రకటించారని కృష్ణయ్య మండిపడ్డారు. ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేర్చడం అంటే గొర్రెల మందలోకి తోడేళ్లను వదిలిపెట్టడమేనని తీవ్ర వ్యాఖ్య చేశారు. కాపులకు రిజర్వేషన్ల కల్పనపై ప్రభుత్వం రెఫరెండం నిర్వహించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News