గంగి రెడ్డి కుటుంబం పై ప్రభుత్వం మరో వేటు

ఎర్ర చందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డి మామ వెంకటసుబ్బారెడ్డి అలియాస్‌ బాబుల్‌రెడ్డికి, సోదరుడు బ్రహ్మానందరెడ్డికి అధికారులు పదవులు రద్దు చేశారు. పంచాయితీరాజ్‌ యాక్టు 19ఏ ప్రకారం పుల్లంపేట ఎంపీపీ, అనంతసాగరం ఎంపీటీసీ పదవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఓ హత్య కేసులో కడప సెంట్రల్‌ జైలులో బాబుల్‌రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారు. అయితే గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కొల్లం గంగిరెడ్డి సతీమణి మాళవిక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన భర్త కు ప్రాణాలకు ముప్పుందని, […]

Advertisement
Update:2016-02-10 02:44 IST

ఎర్ర చందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డి మామ వెంకటసుబ్బారెడ్డి అలియాస్‌ బాబుల్‌రెడ్డికి, సోదరుడు బ్రహ్మానందరెడ్డికి అధికారులు పదవులు రద్దు చేశారు. పంచాయితీరాజ్‌ యాక్టు 19ఏ ప్రకారం పుల్లంపేట ఎంపీపీ, అనంతసాగరం ఎంపీటీసీ పదవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఓ హత్య కేసులో కడప సెంట్రల్‌ జైలులో బాబుల్‌రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారు. అయితే గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కొల్లం గంగిరెడ్డి సతీమణి మాళవిక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన భర్త కు ప్రాణాలకు ముప్పుందని, గతంలో తన భర్త మీద రెండు కేసులు మాత్రమే ఉండేవని.. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా 26 కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.. అదే విధంగా గతంలో డీసిసిబి ఛైర్మన్ గా పనిచేసిన గంగిరెడ్డి సోదరుడు బ్రహ్మానందరెడ్డిని నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే అనేకమంది టీడిపి సభ్యులపై కూడా ఇలాంటి కేసులున్నా కేవలం బ్రహ్మానందరెడ్డిని మాత్రమే అరెస్టు చేశారు. ఇవన్ని గంగిరెడ్డి కుటుంబ సభ్యులపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పలువురు ఆరోపిస్తున్నారు.

Click on Image to Read:

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News