నాలోకి కొత్త రక్తం వచ్చింది, చంద్రబాబులా చేయలేను

కాంగ్రెస్‌లో సుధీర్ఘ కాలం పాటు ఎంపీగా పనిచేసి మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఎంపీ రాయపాటి సాంబశివరావు తనలో రక్తం మారిపోయిందంటున్నారు.  టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత తనలో కాంగ్రెస్‌ నెత్తురు పోయి టీడీపీ రక్తం చేరిందన్నారు. అదే సమయంలో ఎప్పుడైనా తనకు తోచిందే మాట్లాడుతానని స్పష్టం చేశారు. రైల్వే జోన్ తమకు అమరావతికి ఇవ్వాలని డిమాండ్ చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురికావడంపై స్పందించిన రాయపాటి …  రైల్వే జోన్ తమ ప్రాంతానికి […]

Advertisement
Update:2016-02-08 07:02 IST

కాంగ్రెస్‌లో సుధీర్ఘ కాలం పాటు ఎంపీగా పనిచేసి మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఎంపీ రాయపాటి సాంబశివరావు తనలో రక్తం మారిపోయిందంటున్నారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత తనలో కాంగ్రెస్‌ నెత్తురు పోయి టీడీపీ రక్తం చేరిందన్నారు. అదే సమయంలో ఎప్పుడైనా తనకు తోచిందే మాట్లాడుతానని స్పష్టం చేశారు. రైల్వే జోన్ తమకు అమరావతికి ఇవ్వాలని డిమాండ్ చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురికావడంపై స్పందించిన రాయపాటి … రైల్వే జోన్ తమ ప్రాంతానికి వస్తే బాగుంటుందని మరోసారి చెప్పారు.

పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో మాచర్ల, గురజాల, వినుకొండ వంటి ప్రాంతాలు అభివృద్ది చెందలేదని సుధీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో ఉన్న రాయపాటి చెప్పారు. ఇందిరా,రాజీవ్ ఉండి ఉంటే ఇప్పటికీ తనలో కాంగ్రెస్‌ రక్తమే ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇందిరా, రాజీవ్‌లను అపాయింటుమెంట్ అవసరం లేకుండానే నేరుగా వారి ఇంటికి వెళ్లి కలిసేవాడినన్నారు. చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారని ఎంపీ చెప్పారు. తాను మాత్రం 10 గంటలకు మించి కష్టపడలేకపోతున్నానని అన్నారు. చంద్రబాబులా పనిచేయడం తనవల్ల కాదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News