బాలయ్య ఎమ్మెల్యే పదవి ఊడుతుందా?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేసిన బాలకృష్ణ ఊహించని చిక్కుల్లో పడ్డారు.  బాలకృష్ణ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలంటూ కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఏకంగా ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం  ఓటు హక్కు ఉన్న రాష్ట్రంలోనే ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఏపీలోని హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి బాలయ్యకు తెలంగాణలో ఓటు వేసే హక్కు లేదు. ఈ పాయింట్ మీదే పొన్నం ప్రభాకర్ […]

Advertisement
Update:2016-02-04 09:42 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేసిన బాలకృష్ణ ఊహించని చిక్కుల్లో పడ్డారు. బాలకృష్ణ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలంటూ కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఏకంగా ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం ఓటు హక్కు ఉన్న రాష్ట్రంలోనే ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఏపీలోని హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి బాలయ్యకు తెలంగాణలో ఓటు వేసే హక్కు లేదు. ఈ పాయింట్ మీదే పొన్నం ప్రభాకర్ ఈసీకి ఫిర్యాదు చేశారు. నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే గా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని పొన్నం ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధ్య చట్ట ప్రకారం ఎమ్మెల్యేగా బాలకృష్ణ అనర్హుడిగా ప్రకటించాలని పొన్నాల కోరారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం లోక్ సభకు పోటీ చేయడానికి దేశంలోని ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్నా సరిపోతుందని, కానీ అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలని పొన్నాల గుర్తు చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి కాబట్టి బాలకృష్ణ విషయంలో ఆ నిబంధన వర్తిస్తుందో లేదో ఈసీ తేల్చాలి.

Click on image to Read

Tags:    
Advertisement

Similar News