సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అద్దంకి దయాకర్ దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.;

Advertisement
Update:2025-03-10 11:59 IST

హైదారాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్‌తోపాటు విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్, పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకేసారి 4 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కే అవకాశాలుండగా ఒకటి సీపీఐకి ఇచ్చి... మిగిలిన మూడింటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు. ఎస్సీల్లో అద్దంకి దయాకర్‌కు, ఎస్టీల్లో శంకర్‌నాయక్‌కు, బీసీల్లో విజయశాంతికి ఇచ్చింది.

ఎప్పుడూ ఒక్కటైనా ఓసీలకు ఇవ్వడం హస్తం పార్టీ ఆనవాయితీ..1971లో ప్రస్తుత సూర్యాపేట జిల్లా నెమ్మికల్‌ గ్రామంలో పుట్టిన అద్దంకి.. ఎంకాం, ఎంసీఏ, పీహెచ్‌డీ చేశారు. 2014లో, 2018లో తుంగతుర్తి శాసన సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. పీసీసీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ టికెట్‌ అద్దంకి దయాకర్‌కే అని బాగా ప్రచారం జరిగింది. చివరికి మందుల సామేల్‌కు టికెట్ ఇచ్చారు.దయాకర్‌‌కు 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ టికెట్‌ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. కానీ చివరికి అనివార్య కారణాలతో అది కూడా ఇవ్వలేకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

Tags:    
Advertisement

Similar News