అవమానభారం-పార్టీ మారే యోచనలో కోట్ల

అనంతపురం జిల్లా బండ్లపల్లిలో మంగళవారం జరిగిన రాహుల్ సభ కాంగ్రెస్‌కు కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. సభలో తీవ్ర అవమానానికి గురైన మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి అలిగారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనంటూ ఆయన తేల్చిచెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు బుజ్జగింపుల పర్వానికి దిగారు. అసలేం జరిగిందంటే.. రాహుల్‌ సభకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లారు. మాజీ కేంద్రమంత్రి అయిన కోట్ల సభ వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది […]

Advertisement
Update:2016-02-02 18:46 IST

అనంతపురం జిల్లా బండ్లపల్లిలో మంగళవారం జరిగిన రాహుల్ సభ కాంగ్రెస్‌కు కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. సభలో తీవ్ర అవమానానికి గురైన మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి అలిగారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనంటూ ఆయన తేల్చిచెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు బుజ్జగింపుల పర్వానికి దిగారు. అసలేం జరిగిందంటే..

రాహుల్‌ సభకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లారు. మాజీ కేంద్రమంత్రి అయిన కోట్ల సభ వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మీకు అనుమతి లేదంటూ అడ్డగించారు. తాను మాజీ కేంద్రమంత్రిని అని చెప్పిన వినలేదు. ఆ సమయంలో కోట్ల వేదికపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ముఖ్యలు కూడా ప్రయత్నించలేదు. దీంతో అవమానంతో మనస్థానానికి గురైన కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగారు. సభ ముగిసిన తర్వాత విషయం తెలుసుకున్న రఘువీరారెడ్డి.. కోట్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. సభా వేదిక వద్దకు అనుమతించాల్సిన వారి లిస్ట్‌లో కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డికి బదులు కేఎస్‌ ప్రకాశ్‌ రెడ్డి అని ఉందని భద్రతా సిబ్బంది దాన్ని అర్థం చేసుకోలేకపోయారని రఘువీరా సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదని చెబుతున్నారు.

పదేపదే అనుమానాలు భరిస్తూ తాను పార్టీలో ఉండలేనని తేల్చిచెప్పారు. అర్థరాత్రి వరకు తనసొంతూరులో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కోట్ల సమావేశమయ్యారు. వారి వద్ద తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాత్రి కాంగ్రెస్ నేతలు పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, కాసు వెంకటకృష్ణారెడ్డి తదితరులు కోట్లకు ఫోన్ చేసి తొందరపడవద్దని కోరారు. అయితే కోట్ల మాత్రం శాంతించలేదని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే యోచనలో కోట్ల ఉన్నారు. ఆయనను పార్టీలోకి రప్పించేందుకు ఒక పార్టీ నేతలు అప్పుడే రంగంలోకి దిగారని సమాచారం. అయితే కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కోట్ల శాంతిస్తారేమో చూడాలి.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News