ఛీ కొట్టాడు.. నెట్టేశాడు..!

ఇప్పుడు కంగనా రనౌత్ స్టార్ హీరోయిన్. సలామ్ కొట్టేవాళ్లూ, గొడుగు పట్టేవాళ్లూ ఉంటారు. కానీ, ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చాన్సులు అడిగితే ఛీ కొట్టినవాళ్లే ఎక్కువ. ఇటీవల ఓ సందర్భంలో ఆ సంఘటనలను గుర్తు చేసుకున్నారు కంగన. ముఖ్యంగా ఓ పెద్ద మనిషి చేసిన నిర్వాకం గురించి ఆమె చెప్పారు. అతనికి కంగన తండ్రి వయసు ఉంటుంది. జస్ట్ చాన్స్ అడగడానికి వెళ్లిన కంగనాను అతను చాలా చులకనగా మాట్లాడాడు. దాంతో ఇద్దరికీ పెద్ద గొడవే […]

Advertisement
Update:2016-01-18 00:38 IST
ఇప్పుడు కంగనా రనౌత్ స్టార్ హీరోయిన్. సలామ్ కొట్టేవాళ్లూ, గొడుగు పట్టేవాళ్లూ ఉంటారు. కానీ, ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చాన్సులు అడిగితే ఛీ కొట్టినవాళ్లే ఎక్కువ. ఇటీవల ఓ సందర్భంలో ఆ సంఘటనలను గుర్తు చేసుకున్నారు కంగన. ముఖ్యంగా ఓ పెద్ద మనిషి చేసిన నిర్వాకం గురించి ఆమె చెప్పారు. అతనికి కంగన తండ్రి వయసు ఉంటుంది. జస్ట్ చాన్స్ అడగడానికి వెళ్లిన కంగనాను అతను చాలా చులకనగా మాట్లాడాడు. దాంతో ఇద్దరికీ పెద్ద గొడవే అయింది. ఒక్కసారిగా అతను కంగనాను నెట్టడం, ఆమె పడిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆమె తల పగిలి రక్తం వచ్చింది.
భరించలేక, చెప్పు తీసుకుని అతని తల మీద కొట్టింది కంగన. అతనికీ రక్తం వచ్చి కింద పడిపోయాడు. అతగాడి మీద కంగన పోలీస్ కంప్లయిట్ ఇచ్చింది. కానీ, ఖాకీ బాబులు లైట్‌గా మందలించి వదిలేశారు. ‘‘అప్పుడు చాలా షాకయ్యా. పెద్దవాళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనిపించింది’’ అని కంగన అన్నారు. కానీ, తాను చెప్పుతో కొట్టిన వ్యక్తి పేరు మాత్రం ఆమె చెప్పలేదు. ఇదిలా ఉంటే.. తాను పడ్డ కష్టాలు, పడిన సంఘర్షణలతో ఓ పుస్తకం రాయాలనుకుంటున్నారు. కచ్చితంగా ఆ పుస్తకం హాట్ కేక్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Tags:    
Advertisement

Similar News