పవన్‌ మాటలకు కన్నీళ్లు వచ్చాయి

తాను నిర్మించిన 'గేమ్‌ ఛేంజర్‌' ఈవెట్‌ సక్సెస్‌ కావడానికి ఆయనే కారణమన్న దిల్‌ రాజు

Advertisement
Update:2025-01-06 12:21 IST

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తనకు స్ఫూర్తి అని నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. ఆయనను చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. తాను నిర్మించిన 'గేమ్‌ ఛేంజర్‌' ఈవెట్‌ సక్సెస్‌ కావడానికి ఆయనే కారణమని అన్నారు. ఆ ఈ వెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ మాటలు విని తాను భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ను నేను ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా చూస్తుంటా. తొలిప్రేమ నుంచి ఆయనతో నా ప్రయాణం మొదలైంది. సుమారు 25 ఏళ్త ప్రయాణం మాది. కెరీర్‌ మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నారని చాలామంది మాట్లాడుకున్నారు.అందులో నేను కూడా ఒకడిని. రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే ఆయనేమీ విజయాన్ని అందుకోలేదు. పరాజయం వచ్చినా ఆయన ఎక్కడా ఆగలేదు ఎంతో శ్రమించారు. ఇటీవల 21 సీట్లకు 21 గెలుచుకొని ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయనే నిజమైన గేమ్‌ ఛేంజర్‌. సక్సెస్‌ రాలేదని, ఎక్కడా ఆగకూడదని శ్రమిస్తే విజయం తప్పక వర్తిస్తుందని ఆయన్ని చూశాకే అర్థమైంది. వకీల్‌ సాబ్‌ సినిమా వల్ల వచ్చిన పారితోషికం తమ పార్టీకి ఒక ఇంధనంగా పనిచేసిందని గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన నా గురించి చెప్పిన ఆమటలు విని నాకు కన్నీళ్లు వచ్చాయి. ఆయన ఆ విషయాన్ని చెబుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకొని ఆ విధంగా మాట్లాడటం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకు నా పాదాభివందనం అని దిల్‌రాజు అన్నారు. 

Tags:    
Advertisement

Similar News