ముఖ్యమంత్రి కావాలన్నదే లక్ష్యం..త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని త్రిష అన్నారు

Advertisement
Update:2025-01-05 11:53 IST

తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నదే తన లక్ష్యమని ప్రముఖ హీరోయిన్ త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తమ మదిలోని మాటను చెప్పారు. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజా సేవ చేయాలని ఉందంటు రాజకీయాలపై తన ఆసక్తిని బయటపెట్టారు. ప్రస్తుతం త్రిష కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులో సినీ స్టార్లు ఎంజీఆర్, జయలలిత, ముఖ్యమంత్రులుగా పని చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ను కాపాడుకోవడం నేటి తరంలో అంత సులభం కాదు. కానీ త్రిష ఆ ఘనతను సాధించింది.

తన సమకాలీన నాయికలు చాలా మంది సినిమాలకు గుడ్‌బై చెప్పి వైవాహిక జీవితంలో స్థిరపడగా, త్రిష మాత్రం ఇప్పటికీ తిరుగులేని ఇమేజ్‌తో కెరీర్‌లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఐదు భారీ చిత్రాల్లో నటిస్తుందంటే ఆమె క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తమిళనాట రాజకీయాలు, సినిమాలకు విడదీయరాని సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అగ్ర హీరో దళపతి విజయ్‌ సైతం సినిమాల నుంచి తప్పుకొని సొంత పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో త్రిష వ్యాఖ్యలు తమిళనాట ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags:    
Advertisement

Similar News