గ్యాప్ భరించలేకపోతున్న ఎన్టీఆర్

సినిమా హిట్టా…ఫట్టా అనేది ఎన్టీఆర్ కు అనవసరం. నిత్యం సెట్స్ పై ఉండాలనే కోరుకుంటాడు ఈ యంగ్ టైగర్. కెరీర్ లో గ్యాప్ వస్తే అస్సలు సహించలేడు. కనీసం సినిమా-సినిమాకు మధ్య కూడా గ్యాప్ తీసుకోవడానికి ఇష్టపడని తారక్…. వీలైనంత త్వరగా కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి సంబంధించి తాజాగా డేట్ ఎనౌన్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి మూడోవారంలో తారక్ కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు. నిజానికి కొరటాల […]

Advertisement
Update:2016-01-16 00:35 IST
సినిమా హిట్టా…ఫట్టా అనేది ఎన్టీఆర్ కు అనవసరం. నిత్యం సెట్స్ పై ఉండాలనే కోరుకుంటాడు ఈ యంగ్ టైగర్. కెరీర్ లో గ్యాప్ వస్తే అస్సలు సహించలేడు. కనీసం సినిమా-సినిమాకు మధ్య కూడా గ్యాప్ తీసుకోవడానికి ఇష్టపడని తారక్…. వీలైనంత త్వరగా కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి సంబంధించి తాజాగా డేట్ ఎనౌన్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి మూడోవారంలో తారక్ కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ సినిమా ఫిబ్రవరి 10నే ప్రారంభమౌతుంది. షూటింగ్ ప్రారంభమైన వారం-పది రోజుల గ్యాప్ లో ఎన్టీఆర్ వచ్చి జాయిన్ అవుతాడు. అన్నట్టు ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. లాంగ్ వీకెండ్ ను దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ 12న జనతా గ్యారేజీని విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో నటించే హీరోయిన్లపై ఓ స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే నిత్యామీనన్ ను కన్ ఫర్మ్ చేశాడు. త్వరలోనే సమంత లేదా రకుల్ ప్రీత్ సింగ్ లో ఒకర్ని కన్ ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నాడు తారక్.
Click to Read:
Tags:    
Advertisement

Similar News